4, జూన్ 2024, మంగళవారం

చంద్రుడు హాయిని కలుగజేస్తాడు

 సుభాషితం:


చందనం శీతలం లోకే చందనా దపి చంద్రమా1 చంద్ర చందన యోర్మధ్యే శీతలా సాధు సంగత:11


తేటగీతి:


జగతి యందున గంధమ్ము చల్లదనము అంతకును మించి చంద్రుడు హాయినిచ్చు సజ్జనులతోడ సాంగత్య చల్లదనము వాటి రెండింటి కంటెను మేటియగును.


భావం: లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. చందనం, చంద్రుడు రెండింటి కంటెను సజ్జనుల సాంగత్యం మరీ చల్లదనాన్ని కలుగజేస్తుంది. అంటే మనసుకి ఆహ్లాదమును, ప్రశాంతతను చేకూరుస్తుంది.


6:46 am

కామెంట్‌లు లేవు: