8, జనవరి 2025, బుధవారం

డెబ్బయి రెండేళ్ళ తండ్రి

 "మీ నాన్న చాదస్తాన్ని భరించలేక పోతున్నానురా... పైగా ప్రతిదానికీ నస..." అంటూ అరవై ఎనిమిది ఏళ్ళ తల్లి... తన నలభై ఆరేళ్ళ కొడుక్కి డెబ్బయి రెండేళ్ళ తండ్రి గురించి కంప్లయింట్ చేసింది.


కొడుకు ఓపికగా తల్లి చెప్పినది విన్నాడు..


"చెప్పిందే తొంభైసార్లు చెబుతాడు. ఇప్పుడే చెప్పారుగా అంటే, ఇంకొకసారి వినలేవా అని చికాకు పడతాడు. అడిగిందే అరవైసార్లు అడుగుతాడు. ఇందాక ఇచ్చానుగా అంటే, ఇంకోసారి ఇవ్వలేవా అని చిరాకు పడతాడు"..


అమ్మా.... పెళ్ళి చేసుకున్న కొత్తలో, నాన్న మీద నీకేమైనా కంప్లెయింట్స్ వుండేవా 


"లేదురా. ఆయన బంగారుకొండ" గతాన్ని తలచుకొంటూ అంది...


"పోనీ ఆయన నలభైయవ ఏట... నస పెట్టేవాడా ?"


"అబ్బే లేదురా..."


"పోనీ యాభైయవ ఏట నస పెట్టారా ?"


"ఊహూ"

"అరవైవ ఏటా

"లేదు.... ఈ మధ్యనే ఆర్నెళ్లుగా.....


"అమ్మా... నీకు పెళ్ళయిన కొత్తలోనో, షష్టిపూర్తి టైంలోనే నాన్న చనిపోయి ఉంటే. తట్టుకునేదానివి కాదా అమ్మ  ... ఇప్పుడు నాన్నగార్ని దేవుడు తనతో తీసుకెళ్ళే సమయం వచ్చింది - ఆయన వెళ్ళి పోవడం మనకి బాధ కలిగించడానికే దేవుడు ఆ వయసులో నస పెడతాడు.. నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా... ఈ చివరి రోజుల్లోనే... మనం నిజమైన ఓర్చుని, సహనాన్ని, ప్రేమని అందించి తోడుగా ఉండాలి......


తల్లి కళ్ళ నిండా నీళ్ళతో తండ్రి లాంటి కొడుకు కేసి చూసింది. కొడుకు చిన్నపిల్లాడిగా కనబడుతున్న తండ్రికేసి చూశాడు..!!

వయసు మీరుతున్న చివరి మజిలీ లో వున్న ప్రతి తండ్రికి

కామెంట్‌లు లేవు: