*తారుమారు*
జోగయ్య ముగ్గురు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. ఇంక పెళ్ళికెదిగిన కొడుకు ఉన్నాడు. ఆచారాలు సాంప్రదాయాల పేరుతో తమ దగ్గర దోచిన దంతా కొడుకు ద్వారా లాగాలని ఒక ఆశ.
అందుకు భార్య కూడా తాళం వేస్తున్నది.
పిలగాడికి పిల్లనివ్వాలని వస్తున్నారు. పిలగాడు నచ్చాడు గాని వసారాలో ఉండటంతో సుతారము ఇష్టం లేక వెనుతిరుగుతున్నారు.
వారి భావం గ్రహించి ఈ వసారాలో ఉన్నంతకాలం పదిరూపాయలు ఇచ్చే సంబంధం రాదని, అప్పుచేసి మేడ కట్టాడు.
ఆశించినట్టే సంబంధాలు వస్తున్నాయి. కాని, జోగయ్య అడిగే కట్నానికి బంగారానికి కంగారు పడి తిరిగి చూడకుండా పోతున్నారు.
పెద్ద వారికి వీరు ఆనటం లేదు చిన్నవారికి వీరు మోటుకోవడం లేదు. కాలం గడచి పోతున్నది. వడ్డీలు పెరిగి పోతున్నాయి. వారికి కట్నం ఆశ ఎక్కువని అందరికీ తెలిసి పోయి రావడం మానుకున్నారు.
అమ్మాయిల కోసం తిరిగి న ఖర్చు లతో బ్రహ్మాండమైన పెళ్ళి చేయవచ్చు.
అబ్బాయికి మీసాలు గడ్డం లో తెల్లవెంట్రుకలు పొడచూపుతున్నాయి.
ఇంక నాలుగు రోజులు జరిగితే అసలు పిల్లను కూడా ఇవ్వరని, పేదింటి అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి, కరోనా సమయంలో నలుగురిని పిలిచి, అయిందనిపించారు పెళ్ళి ఏడుపు ముఖాలతో
తిరిగి చూసుకుంటే అప్పులు తడిచి మోపెడైనాయి.
అయిన కాడికి మేడ తెగనమ్మి అప్పులు కట్టి, ఊరిచివరన ఓ గుడిసె వేసుకుని కాపురం పెట్టాడు జోగయ్య.
మీ దురాశ వల్ల ఇల్లు పోయింది. మేము ఈగుడిసెలో ఉండలేమని కొడుకు కోడలు పట్నం వెళ్ళి పోయారు.
లోకుల సొమ్ముకు ఆశ పడ్డందుకు బాగా చెంపలు వాయగొట్టుకున్నాడు మన జోగయ్య.
✍🏻జంజం కోదండ రామయ్య
*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు క్రింది లింక్ ద్వారా చేరండి*
https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి