30, అక్టోబర్ 2020, శుక్రవారం

ఆచార్య సద్భోదన

 *ఆచార్య సద్భోదన*


ఏ కోరిక లేని వారికి సమస్తమూ చేకూరుతుంది.


ఎవరైతే ఇతర భావాలు లేక నన్ను చింతిస్తూ ఎడతెగక ధ్యానిస్తారో నా యందే నిష్ఠ కలిగిన అట్టివారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

-భగవద్గీత.


కొందరి వద్ద ఏదీ ఉండదు. అయినా వారిలో రాచరికపు ఠీవీ ఉట్టిపడుతూ ఉంటుంది. అసలు పరిత్యాగం అంటే అర్థం ఏమిటి? మనకున్న పరిమితులను వదిలివేయడమే. అటువంటి పరిత్యాగం చేసిన వారికి అల్ప విషయాల మీదకు దృష్టి మళ్ళదు. 


సంతోషం కోసం అందరూ అర్రులు చాస్తూ ఎదురుచూస్తారు, కానీ *నాది, నేను* అనే రుగ్మతలు దానిని అందనివ్వక నిరోధిస్తాయి. 


మన ఆలోచనా పరిణతి మారే కొద్దీ ఆశ, అహంకారం, ఈర్ష్యలనే సంకుచిత వలయాల నుండి బయటకు వస్తాం. మహాత్ములకు భౌతిక వస్తువుల పట్ల ఏ మాత్రం వ్యామోహం కలగదు. సన్నిపాత జ్వరంలో అధిక ఉష్ణం వలన మతి స్థిరంగా లేక అన్నీ వంకరగా తోస్తాయి. అదే విధంగా ప్రాపంచికత అనే జ్వరం ఉన్నా వాస్తవం అపసవ్యంగా కనిపిస్తుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: