25, మార్చి 2023, శనివారం

హాని జరగలేదు

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సంపన్నత్వం- సాధారణత్వం*


సంపన్నత్వమంటే లౌకికమైన సంపదగలవారు మరియు ఆధ్యాత్మిక సంపదగలవారని కూడా అర్ధము. సంపన్నత్వము కలవారు తప్పక సాధారణత్వం కల్గి వినమ్రులై భగవంతునకు కృతజ్ఞులై ఉండాలంటారు శ్రీ స్వామివారు. నేను సంపదనార్జించి శ్రీ స్వామివారికి దానం చేసిన దాతను. కనుక నాకు ప్రత్యేక దర్శనము, ప్రత్యేక మర్యాదలు కావాలని మనసులో కూడా కోరరాదు. అలాంటి ప్రత్యేకతలు సంస్థానం వారు ఇచ్చినా స్వీకరించరాదని శ్రీమాన్ బూటీ మహాశయుని చివరి సందేశమేగాక, పూజ్యపాదులు ఆచార్య భరద్వాజ మాష్టరు గారి సలహా మరియు ఆచరణ మాత్రమేగాక, శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్ గారు మానవాళికి ఒసంగిన దివ్య సందేశమదే.


 శ్రీ స్వామివారు సర్వసాక్షి కనుక మనం సమర్పించినది వారికి తెలుసు. మరి మనమిపుడు ప్రత్యేక మర్యాదలు, ప్రత్యేక దర్శనాలు కోరుతున్నామంటే, మనం కైంకర్యము చేసిన దానికి బదులు ఈ ప్రత్యేక దర్శనాలు, మర్యాదలు కొంటున్నామని భావం. వజ్రాలనిచ్చి గాజు పెంకులు కొనే ప్రబుద్ధులమవ్వాలని తలచవచ్చా? ఆశ్రమం వారు కళ్ళు తెరచి ఇలాంటి అమాయకులకు నిజరహస్యం బోధించేటట్లు చేయమని శ్రీ స్వామివారిని ప్రార్ధిద్దాం.  శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఎవరో ఏమి చెప్పారో తెలుసుకోవాలనే సత్పురుషులు శ్రీ జ్ఞానేశ్వర్ భగవద్గీత అనే పేరుతో అన్ని 'వెంకట్రామ్ అండ్ కో' లలో దొరుకు గ్రంధం చదవండి. అందులో ఈ విషయం 16వ అధ్యాయం 4వ శ్లోకంలో వివరించారు.


*''ఈ లోకమునందును, పరలోకమునందును మనకు స్నేహ పూర్ణుడుగా నుండు ధర్మము-అభిమానముతో మేము ధర్మాచరణమొనర్చుచున్నామని చెప్పుకొనుచున్నచో మనను తరింపజేయు ధర్మము కూడా మనకు దోషముకలుగ జేయుచున్నది.* కావున ఓ అర్జునా! మనము చేసిన ధర్మ కార్యమును ఆడంబరముగా నలుదిక్కులకు ప్రచారము చేసుకొన ఆరంభించినచో ఆ ధర్మము కూడా అధర్మమే అగును.' గనుకనే విద్యానగర్ (నెల్లూరు జిల్లా) లో పూజ్యశ్రీ భరద్వాజగారి ఆధ్వర్యములో నిర్మించిన శ్రీ శిరిడీ సాయి మందిరంలో వస్తువులపై పేర్లుగానీ, మందిర నిర్మాణమునకు సహకరించిన వారి పేర్లుగానీ వ్రాయబడలేదు. ఇందుకే కాబోలు పెద్దలు 'గుప్తదానం' అన్నారు. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 21*

                 *సౌజన్యమూర్తి*

                              - శ్రీ ఎమ్. గోపాలకృష్ణమూర్తి


తర్వాత ఆలోచిస్తే నాకెంతో  ఆశ్చర్యం వేసింది. మాస్టార్ గారు కరెక్ట్ గా ఆ టైమ్ కే రావటం, నా తలనొప్పి తగ్గటానికి ఆయన టీకి పిల్చుకుపోవటం, మధ్యలో ఎవరి ద్వారానో నోట్స్ దొరకటం తల్చుకుంటే యిదంతా మాస్టార్ గారి కృపే అనిపిస్తుంది. లేకపోతే హాయిగా కూర్చుని మాట్లాడ్తున్న వారల్లా మూడు కిలోమీటర్ల దూరంలో వున్న టీ బంక్ కి తీసికెళ్ళటం ఆయన కరుణగాక మరేమిటి? ఆయన రాకపోతే ఆ పేపర్ దొరికే ప్రసక్తే లేదు. ఆ తర్వాత కనుక్కుంటే మాస్టార్ గారు లేరు. ఏవో పేపర్లు దిద్దటానికొచ్చారు. దిద్దటం అయిపోయింది. ఆయనెళ్ళిపోయారు.


ఇంకోసారి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది. కాని నాక్కొంచెం కూడా హాని జరగలేదు. నా బండిని చూసిన వాళ్ళెవరూ నమ్మలేరు.ఎందుకంటే అంత ఘోరంగా బండి పాడయిపోయింది. ఇది కూడా మాస్టార్ గారి, బాబా గారి చలవే.


                       🙏జై సాయిమాస్టర్🙏

కామెంట్‌లు లేవు: