25, మార్చి 2023, శనివారం

సుభాషితమ్


             _*సుభాషితమ్*_


*బ్రాహ్మణాః పాదతో మేధ్యా*  

 *గావో మేధ్యాస్తు పృష్టతః*

 *అజాశ్వే ముఖతో మేద్యౌ*

 *స్త్రియో మేధ్యాస్తు సర్వతః* 


తా: *ఈ లోకములో స్వతహాగా పవిత్రమైనవి -  మంగళ దాయక మైనవి.....సద్బ్రాహ్మణుని(సద్భక్తుని)పాదారవిందాలు, ఆవుయొక్క వెనుక భాగము, మేకల, గుర్రాలముఖ భాగము, ఉత్తమురాలైన స్త్రీయొక్క సర్వాంగాలు శుభకరం( మాతృ భావన తో సేవించడం )వీటిని దర్శించిన సేవించిన మాత్రాననే సర్వ పాపములు తొలగిపోవును.*...


*మేధ్యం: పవిత్రమైన అని అర్థం*.


              _*సూక్తిసుధ*_



*ఒకప్పుడు దోషమును విడువనివి:* 

            వేపచెట్టుకు తేనె పోసి పెంచియు చేదుమానదు, పామునకు పాలు పోసియు విషము పోదు, గాడిద ఎంత చక్కబెట్టియు జోడుకాలు మానదు, కుక్కతోక బద్దవేసికట్టియు చక్కగాదు, గుడ్డి కంటికి కుంచెడు కాటుక పెట్టియు కనుపించదు, ఉల్లిగడ్డకు పన్నీరు పోసియు కంపుమానదు. మడ్డివానికెంత జెప్పియు తెలివిరాదు.

కామెంట్‌లు లేవు: