*1972*
*కం*
అక్కర మనతో యుండగ
చక్కగ మనవెంటనుండి సన్మిత్రముగన్
అక్కర తీరగమనలను
గ్రక్కున విడిపోవువారు కౌడులు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మనతో అవసరం ఉన్న నాడు చక్కగా మనతో మంచి స్నేహం పంచి మనతో అవసరం తీరగానే మనలను విడిచిపెట్టి వెళ్లిపోయేవారు కపటులు(కౌడులు).
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి