22, జులై 2020, బుధవారం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹


 📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి!

సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి మహాత్ముడు యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి.

అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.

సశేషం...

కామెంట్‌లు లేవు: