22, జులై 2020, బుధవారం

*రామాయ రామభద్రాయ*


*రామాయ రామభద్రాయ* 
*రామచంద్రాయ వేథ సే |* 
*రఘునాథాయ నాథాయ*
*సీతాయాః పతయే నమ: ||* 

_రామా! రామభద్రా! రామచంద్రా! విధాతృ స్వరూపా! రఘునాథా! ప్రభూ! సీతాపతీ! నీకు నమస్కారం._

*శ్రీరామ రామ రఘునందన రామరామ|* 
*శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ ||* 
*శ్రీరామ రామ రణకర్కశ రామరామ |* 
*శ్రీరామ రామ శరణం భవ రామరామ ||* 

_శ్రీరామా! రామా! రఘునందనా! భరతాగ్రజా! రణకర్కశా! – ఓ శ్రీరామా! శరణం రామరామ!_

*శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి |* 
*శ్రీ రామచంద్ర చరణౌ వచసా గృణామి ||* 
*శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి |*
*శ్రీ రామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే ||*

_శ్రీరామచంద్రుని చరణాలను నేను మనసా స్మరిస్తున్నాను._
_శ్రీరామచంద్రుని చరణాలను వాక్కు ద్వారా నేను శ్లాఘిస్తున్నాను._ 
_శ్రీరామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను._ 
_శ్రీరామచంద్రుని చరణాలను నేను శరణు వేడుచున్నాను._

*మాతా రామో మత్సితా రామచంద్ర:|* 
*స్వామీ రామో మత్సఖా రామచంద్రః ||*
*సర్వస్వం మే రామచంద్రో దయాళు:|*
*నాన్యం జానే నైవ జానే న జానే ||* 

_రాముడే నా తల్లి. రామచంద్రుడే నా తండ్రి. రాముడే నా ప్రభువు. రామచంద్రుడే నా సఖుడు. దయామయుడైన రామచంద్రుడే నా సర్వస్వం. ఆయనను తప్ప నేను మరెవరినీ యెంతమాత్రమూ యెరుగను._

*దక్షిణే లక్ష్మణో యస్య* 
*వామే చ జనకాత్మజా |*
*పురతో మారుతిర్యస్య* 
*తం వందే రఘునందనమ్ ||*

_కుడి వైపున లక్ష్మణుడు, ఎడమ వైపున జానకీదేవి ము౦దు ఆంజనేయుడు తో విరాజిల్లుచున్న రఘున౦దనుకి వందన౦._

*లోకాభిరామం రణరంగధీరం |* 
*రాజీవనేత్రం రఘువంశనాథమ్ ||* 
*కారుణ్యరూపం కరుణాకరం |*
*తం  శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||* 

_లోకాభిరాముడు, రణరంగధీరుడు, రాజీవనేత్రుడు, రఘువంశనాథుడు,  కారుణ్యరూపుడు, కరుణాకరుడు  అయిన శ్రీరామచంద్రుని నేను శరణు వేడుచున్నాను._

*మనోజవం మారుతతుల్య వేగమ్ | 
*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ||* 
*వాతాత్మజం వానరయూథముఖ్యం | 
*శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||*

_మనోవేగంతో, వాయువేగంతో ప్రయాణించేవాడు, జితేంద్రియుడు, మహాబుద్ధిశాలి, వాతాత్ముజుడు (వాయునందనుడు), వానర సేనలో ముఖ్యుడు అయిన శ్రీరాముని దూతను (హనుమంతుని) నేను శరణు వేడుచున్నాను._

************************

కామెంట్‌లు లేవు: