22, జులై 2020, బుధవారం

*కరోనా కట్టేసే తిప్పతీగ!!!*


అనంతసాహితి -ఆయుర్వేదం పంచమవేదం-004
-----------------------------------------

నాసంవృతముఖః కుర్యాత్క్షుతిహాస్య విజృంభణం|
నాసికాన్నవికృష్ణీయాన్|
(నోరు, ముక్కు గుడ్డతో కప్పుకోకుండా చీదడం, తుమ్మడం, ఆవులించడం, నవ్వడం, దగ్గడం వంటివి చేయరాదు. అనవసరంగా ముక్కులోకి వేలు పెట్టుకోరాదు. ముక్కుపుటాలు తాకుతుండరాదు. ) 
++++++++++++++++++

సాధ్యయోరపి సంయోగో బలినోర్యాత్యసాధ్యతామ్||
విద్యాదసాధ్యమేవాతః సాధ్యాసాధ్యమాగమమ్|
నాసాధ్యః సాధ్యతాం యాతి సాధ్యో
యాతిత్వసాధ్యతామ్||
పాదాపచారాద్దైవాచ్చ యాన్త్యవస్థాన్తరం గదాః|

(గతంలో చికిత్స ఉన్న వ్యాథులు కూడా వివిధ వ్యాథులతో కలయిక వల్ల చికిత్స చేయలేనివి కావచ్చు. అంతేకాక, చికిత్సలేని వ్యాథులతో కలువడం వలన చికిత్స ఉన్న వ్యాథులు కూడా ఎదురుతిరిగి చికిత్సకు లొంగకపోవచ్చు.

చికిత్సలేని వ్యాథులు కొద్దికాలం ఎదురు తిరగవచ్చు. అలాగే వీటి సాంగత్యం వలన చికిత్సకు లొంగే వ్యాథులు కూడా ఎదురుతిరగవచ్చు. భగవంతుని ఇచ్ఛ వలన, వైద్యుల అశక్తి వలన కూడా చెలరేగవచ్చు. వ్యాథులు తమ తీరు మార్చుకొని కొత్తవాటిగా పుడతాయి.)   
+++++++++++++++++++++++

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారికి ఆయుర్వేదం అంటే ప్రత్యేకమైన అభిమానం, ఆరాధనా ఉంది. ఎందుకంటే మహాపురాణాలు ఆయుర్వేదాన్ని పంచమవేదంగా చెప్పాయి. ఆయుర్వేదం సాక్షాత్తు పరమేశ్వరుని నుంచీ సూర్యభగవానుడు పొందాడు. కనుకనే మహాశివుడ్ని వైద్యనాథునిగా కొలుస్తారు. ఆరోగ్యవైద్యశాస్త్రం ఆయుర్వేదం సూర్యుని ఆధీనంలోకి వెళ్ళిన కారణం చేత ఆరోగ్యం సూర్యుని హస్తగతమైంది. ఈయనకు పుట్టిన అశ్వినీ దేవతలు వైద్యశాస్త్రానికి అధిదేవతలు అయ్యారు. 

వేదాలతోపాటు సమానంగా పుట్టిన ఆయుర్వేదం సనాతనమైంది. లక్షలాది సంవత్సరాల క్రితం ఉద్భవించింది. నేటికీ మానవాళి సంరక్షణకు మేరుశిఖరంలా నిలిచింది. దీనికి ఉదాహరణే పైన ఇచ్చిన ఆయుర్వేద జ్ఞానగుళికలు.

యుగాల క్రితమే వైద్యులు సంస్కారం, సంప్రదాయం, నాగరికత నేర్పుతూ వైద్యశాస్త్రరీత్యా సదాచారాలు నేర్పారు. అందులోదే మొదటి సుభాషితం. ఇది వాగ్భటీయమైన అష్టాంగహృదయం నుంచీ సేకరించింది. నేడు కరోనా వల్ల వేల ఏళ్ళ క్రితం భారతీయ భిషజులు చెప్పిన ఆచారకాండనే ఆధునిక వైద్యులు చెప్పారు. అయితే నేటి ఆధునిక వైద్యులు చేసేది అరగుండు క్షవరం అని దీన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. 

కరోనా దగ్గువల్లా, తుమ్మువల్లా తుంపర్ల వల్లా వ్యాపిస్తుందని తెలుసు. అయిదే గాలిద్వారా వ్యాపిస్తుందని చాలా ఆలస్యంగా కనుక్కున్నారు. మానవుడు మాట్లాడేటప్పుడు కూడా తుంపర్లు వస్తూ ఉంటాయి. అంతేకాక చీదడం, తుమ్మడం, ఆవులించడం, నవ్వడం, త్రేన్చడం, దగ్గడం వల్ల కూడా వైరస్లు వెలువడుతాయని ఆయుర్వేదం వేలా కొలదీ ఏళ్ళక్రితం చెప్పింది. కనుకనే ముక్కునూ, నోరునూ గుడ్డతో అడ్డుపెట్టుకొని చీదడం, తుమ్మడం చేయాలి. ఆధునిక వైద్యులకు తెలియనిది ఆవులించడం, నవ్వడం, త్రేన్చడం వల్ల కూడా వైరస్లు గాలిలో కలుస్తాయని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. కనుక ఇవి చేసేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని బట్టీ తుచ్ఛమైన కాసుపీసాణం ఆంగ్లవైద్యం కన్నా ఆయుర్వేదం ఎన్ని వేల ఏళ్ళ క్రితమే ఎంత అడ్వాన్సుడ్ గా ఉందో తెలుసుకోవచ్చు. మానవుడి నుంచీ వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. కనుక అందులో వైరస్ లు ఉండే అవకాశం ఉందని వాగ్భటాది ఆయుర్వేద వైద్యులు చెబుతారు. 

కొన్ని సినిమాల్లో మేనరిజం కోసం ముక్కుపుటాలు తాకుతుండడం చూపిస్తారు. అయితే అది ఆరోగ్యశాస్త్రాలు నిషేధించిన అలవాటుగా గుర్తించాలి.

వైద్యులకు లొంగని వ్యాథులు ఆయుర్వేదవైద్యుల దృష్టిని ఆదిలోనే ఆకర్షించాయి. కనుకనే రెండో సుభాషితాన్ని మహావైద్యగ్రంథాల మొదట్లోనే చెప్పారు. దీని ద్వారా వైద్యుల కర్తవ్యాకర్తవ్యాలు ఉద్బోధించారు. అది నేటికీ నిజం అవుతూ ఉండడం గమనార్హం. 

ఈ పరమేశ్వరానుగ్రహమైన ఆయుర్వేదంలో వేలు లక్షల ఏళ్ళ నుంచీ మానవులకు సేవ చేస్తున్న అనేక వనమూలికలూ, రసాయనాలు, జీవధాతువులు ఉన్నాయి. ఇటువంటి వాటిలో అతిముఖ్యమైంది తిప్పతీగ, గుడుచి అనే పేర్లతో పిలిచే గిల్లోయ్. దీన్ని వైద్యులు అమృతం ముద్దుపేరుతో పిలుస్తారు. ఈ మందు సకలసంజీవని వంటిది. దీని ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

 
తిప్పతీగ నేడు కరోనా దుష్ర్పభావాలు అడ్డుకోవడంలో కూడా ముఖ్యపాత్ర పోషించగలదు. కరోనాలో ఉన్న ప్రధాన దుర్లక్షణం పాకిస్తాన్ తీవ్రవాదితో పోల్చవచ్చు. అక్రమంగా చొచ్చుకు వచ్చిన ముష్కరులు ఎక్కడ ఏవిధంగా దాడి చేస్తారో తెలియదు. ఇటువంటి కరోనాను కూడా అనేక విధాలుగా అడ్డుకోగలిగిన మందు కావాలంటే అది తిప్పతీగమాత్రమే అని అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు తేల్చారు. బహుముఖయుద్ధం చేయగలగడమే తిప్పతీగ ప్రజ్ఞ.

ఇది ప్రధానంగా శరీరంలో రోగనిరోధక శక్తిపెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లను విడుదలను శరీరంలో విద్యుదుత్పత్తి కేంద్రం మాదిరిగా చేస్తుందని క్రీస్తుపూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రితం ఆయుర్వేదం కనుగొంది. శరీరంలోని అనేక మలినాలు విషాల నుంచీ రక్తాన్నీ, దేహాన్నీ శుభ్రం చేస్తుంది. అనేక క్రిమి కీటకాల నుంచీ రక్షణ ఇవ్వగలదు. అన్నిటికీ మించి గుండెకు రక్షణ కోట కట్టే మందు ఇది. అనేక హృద్రోగాలను ఇది ఆపగలదు. ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. కొన్ని రకాల ఆస్తమాలకు కూడా ఇది చికిత్స చేయగలదు.

అనేక రకాల జ్వరాలను నివారించగలదు. ఆయుర్వేదం ప్రకారం జ్వరం అనేక వ్యాథులకు కన్నతల్లి. వేల ఏళ్ళ క్రితం నాటి తిప్పతీగ 21వ శతాబ్దంలో జ్వరానికి పుట్టిన వికృత శిశువులు డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియాలను కూడా అడ్డుకోగలదు. ఆయుర్వేదంలో రోగాన్ని పెంచే వాటిలో ముఖ్యమైంది ఆకలి మందగించడం, అరుగుదల లేకపోవడం. ఈ లక్షణాన్ని గిల్లోయ్ నాశనం చేసి తిన్న ఆహారం అరిగేట్లు చేసి శరీరానికి శక్తినివ్వగలదు. 

నేడు అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా వేదిస్తున్న చక్కెర వ్యాధిని అదుపు చేయగలదు. ముఖ్యంగా టైప్ 2 రక్తచక్కెరను తిప్పతీగ రసం కూడా అదుపుచేయగలదు. సాఫ్టవేరు ఉద్యోగులు వంటి వారికి వస్తున్న ఆవేదన, మానసిక వత్తిడులను ఇది తీసివేయగలదు.  

వయసు వార్థక్యంలో వచ్చే కీళ్ళవాతం, ఎముక సంధుల రోగాలు (ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్లు, రొమటాయిడ్) వంటి వాటికి ఇది మహాద్భుతంగా పనిచేస్తుంది. కంటి చూపు బాగుచేయగలదు. ముసలి తనం రాకుండా అడ్డుకోగలదు. 

ఇన్ని శుభలక్షణాలున్నాయి కనుకనే దీన్ని భారత ప్రభుత్వరంగంలో ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి చేయాల్సిన ఆయుష్ సంస్థ బుద్ధి ఉన్న తొలిరోజుల్లో తిప్పతీగను కరోనా నివారణ ఔషథంగా ప్రజలకు సూచించింది. బాబా రాం దేవ్ ఈ తిప్పతీగను ఉపయోగించి కరోనా మందు తయారు చేయడంతో ఏ ఆంగ్ల వైద్యులకు అమ్ముడు పోయిందో కానీ ఆయుష్ సంస్థ విషం కక్కింది. 

జనాలు చచ్చిపోతుంటే వేలాది ఏళ్ళ నుంచీ అందుబాటులో ఉన్న వనమూలికలతో మందు తయారు చేస్తే ఆయుష్ సంస్థకు అభ్యంతరం ఏమిటో ఎవరికీ అర్థంకానిది. పైగా ఆయుష్ సంస్థ ఉన్నదే ప్రత్యామ్నాయ వైద్యవిధానాన్ని అభివృద్ధి చేయడానికి. కానీ ఇది పాము తన గుడ్లు తానే తిన్న చందంగా ఆయుర్వేద భక్షణ సంస్థగా మారి ప్రజల్ని దోచుకుతినే ఆంగ్లవైద్యానికి రక్షణ సంస్థగా మారుతోంది. క్లుప్పంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయ వైద్యం నాశనం చేయడానికే పుట్టిన సంస్థగా మారింది.

నేడు అనేక చావులు పరిశీలిస్తే అవన్నీ చనిపోవాల్సినవి కావని ఇట్టే తెలుస్తుంది. యువకులు చనిపోవడం గమనిస్తే దమననీతితో ఆయుర్వేదాన్ని అడ్డగించడానికి కారణం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఒక్కవ్యక్తి మరణించకుండా ఆయుర్వేద మందులు కాపాడినా చాలు అనే ఇంగితం ప్రభుత్వరంగ సంస్థకు లేకపోవడం చూస్తే ఇది ఉండాల్సిన అవసరం ఉందా? అనే సందేహం కలుగుతోంది. 

తిప్పతీగ గోళీలు వాడితే నిర్భయంగా ఉండవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ళ లోపు వారు రోజు ఒక మాత్ర వాడితే చాలని సలహా ఇస్తున్నారు. సామాన్య ఆరోగ్యం లేని 30 ఏళ్ళ పై వారు కూడా తమను సంప్రదించి రోజు రెండు వరకూ వాడవచ్చని చెబుతున్నారు. 

సాధారణ మార్కెట్టులో పనిచేస్తుందో చేయదో తెలియని 5000 రూపాయల ఆంగ్ల మందును 30 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముతున్న ఆంగ్ల మాఫియా ముందు ఆయుష్ సంస్థ కళ్ళు కాళ్ళులేని జీవచ్ఛవంగా మారిందనే వారు లేకపోలేదు. 

అశ్వగంధ ఒక బిళ్ళ, గిల్లోయ్ ఘనవతి బిళ్ళ ఒకటి ప్రతిరోజూ వాడితే కరోనా దరికి రాదని వారు చెబుతున్నారు.  దీని ఖర్చు రోజుకు  4 రూపాయల.25 పైసలు మాత్రమే అవుతుందని, వీటిని వాడడం కన్నా లక్షరూపాయల ఆక్సిజన్ సిలెండర్ బ్లాకులో కొనుక్కుని ఇంట్లో బాంబు మాదిరి దాచుకోవడం ఏమిటని నవ్వుతున్నారు.

అన్నిటికీ మించి నేడు మార్కెట్లో గిల్లోయ్ ఘనవతి దొరకడం లేదనే వారు కూడా లేకపోలేదు. 

కరోనాను పారదోలే మరిన్ని ఆయుర్వేద మందుల గురించి ముందు ముందు తెలుసుకుందా.

స్వామి అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు.

కామెంట్‌లు లేవు: