🪔 🪔 🪔 *కాంతిపర్వం* 🪔 🪔 🪔
*_భారతదేశానిది ప్రధానంగా యజ్ఞ సంస్కృతి. దాని చిరు ప్రతిబింబమే దీపారాధనం._*
*చీకటి-వెలుతురు, భయం-అభయం, దుఃఖం-ఆనందం... వంటి ద్వంద్వాల్లో మొదటివన్నీ తమస్సుకు ప్రతీకలు. రెండోవి వికాసానికి సంకేతాలు. ‘తమస్సు’ అనే పదానికి అంధకారం అవిద్య అవివేకం నరకం పాపం దుఃఖం... వంటి ఎన్నో అర్థాలను చెబుతుంది నిఘంటువు. తమస్సును సమూలంగా నిర్మూలిస్తూ వికాసం దిశగా సాగిపోవాలనే ఆత్మగత ఆరాటానికి అపురూప ఆధ్యాత్మిక ప్రతీకే- దీప ప్రకాశనం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే దివ్యమైన ఆకాంక్ష దీనికి ఆధార భూమిక!*
*_నేడు జాతుల మధ్య విస్తరిస్తున్న వైరి భావాలను తొలగించాలన్నా, కరోనా మహమ్మారి నుంచి క్షేమంగా తేరుకోవాలన్నా_* *‘శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపదా, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే’* *_అంటూ పరంజ్యోతి స్వరూపాన్ని ఆలంబనగా గ్రహించడం లోకానికి మేలు._* *ముఖ్యంగా తీవ్ర వాయుకాలుష్యం విషయమై జాతీయ హరిత ట్రైబ్యునల్ తాజాగా 18 రాష్ట్రాలకు తాకీదులు అందించిన నేపథ్యంలో- మనం ముట్టించవలసింది దీపాలనే కాని, బాణాసంచాను కాదని గ్రహించి తీరాలి. దీపావళినాడు మనం దీపాలను ఎక్కువ సంఖ్యలో వెలిగించాలి. అది బాణసంచాను ముట్టించడానికో, పర్యావరణాన్ని తుదముట్టించడానికో కాకూడదన్నదు ‘విలయ పయోధిమగ్నమయె విశ్వమహీ వలయంబు’ అని మహాభారతం చెబుతుంది. తమస్సు దాని అన్ని రకాల అర్థాలతోను లోకాన్ని ఆవహించిన వేళ మనకీ వివేచన చాలా అవసరం!*
*_దీపావళి శుభాకాంక్షలు
🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔 🪔
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి