🙏శివానందలహారీ🙏
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే
శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే2ఖిలశుభే
కిమర్థ : దాస్యే2హం భవతు భవదర్థ0 మమ మనః
పరమేశ ! నీ చేత బంగారు కొండుండె
దాపులో నీ కడ ధనదుడుండె
కల్పకతరువుండె కామధేనువు నుండె
చింతామణుండె నీ చెంత లోనె
శీత శుభ్రా0శుండు శిరముపై శోభిల్లె
చరణ యుగళి చెంత సకల ముండె
సర్వ మంగళ నిధులు నీ సన్నిధు0డె
యీశ్వరా ! యింక నేనేమి యీయ గలను ?
నిరత పరవశ భక్తితో నిన్ను గొలుచు
చిత్త మర్పణ సేతును స్వీకరించు 27 #
సారూప్యం తవపూజనే , శివ ! మహాదేవేతిసంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే !
సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ !
కృతార్థో2స్మ్యహమ్
శంకరా ! భవదీయ సత్పూజనములతో
సారూప్య ముదయించె సత్వరముగ
శివ మహాదేవంచు స్థిరముగా కీర్తించ
సామీప్య ముదయించె సత్వరముగ
సహ భక్త సాంగత్య సంభాషణంబున
సాలోక్య ముదయించె సత్వరముగ
సకల చరాచర సధ్యాన ఫలముగా
సాయుజ్య ముదయించె సత్వరముగ
ఈశ ! సర్వాను భవములీ యిహమునందె
భవ్యమౌ నీదు కరుణతో ప్రాప్త మయ్యె
నిండు మనమున కృతార్థుండ నైతి
భవము ధన్యత నొందెను పార్వతీశ ! 28 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి