జీవ లక్షణము ప్రకృతికి సంబంధమును వేదం చాలా చోట్ల చాలా సందర్భములలో వివరించినది. దాని వివరణ పృథివ్యాపస్తేజోవాయుః ఆకాశాత్... అని ఆకాశాత్ వాయుః వాయెాః అగ్ని అగ్ని ఆపః ఆపః పృథ్వి పృథ్వి పృథ్వీ అంతరిక్షం... మంత్ర పుష్పం కూడా అగ్నిః వా అపాం.. వాయుః వా అపాం... పర్జన్యో వా అపాం... చంద్రమావా అపాం... అసోవై తపన్నపాం.. నక్షత్రాణివా అపాం... సంవత్సరోవాః అపాం... వీటి పరిణామం కూడా సమస్త జగత్తుకు మూలమైన శక్తిని విగ్రహ రూపంలో అనగా మన జీవ దేహం రూపము వలనే అయిన సర్వాంతర్యామిని తెలుసుకొనుటయనే ప్రయత్నమే. అసౌయెూ వసర్పతి నీలగ్రీవో ... అన్న అసౌయెూ పదము... అసోవై తపన్నపాం ఆయతనం అని అసీత్ అంతరిక్షం. సత్ అసత్గా అసత్ సత్ గా తెలియుట. యిదియే జీవ మూల పరిణామతత్వంగా తెలియుచున్నది. అసతోమా సద్గమయ...పంచభూతాత్మకమైన శరీరముగా జీవుని ద్వారానే సమస్తం తెలియబడును. అందుకే ఎన్ని జన్మల పుణ్యమెూ...అని అన్నమయ్య...కీర్తనలు వింటాం. పాడుతాం సాధన చేసి వాటి వలన డబ్బులు కీర్తి ప్రతిష్ట గౌరవం సంపాదనకు మాత్రమే సాధనముగా ఉపయెూగించుట. అంతే అయితే అది అహంకారం. పరమాత్మ తత్వం తెలుసుకొనుటకు అనేక విధములుగా తెలియుటకు యివి వక మార్గములు మాత్రమే.జన్మలు ఎత్తుటను ప్రమాణంగా ఎందరో తెలిపినారు.కాని అవి తెలియుటకు ప్రయత్నమే లేదు.వేదముల ఉపాంగములైన సంగీతము, జ్యోతిష, తర్క, న్యాయ మీమాంసాది సమస్తములు, నిర్గుణ, నిరంజన, నిరామయ, నిర్వికల్ప తత్వమును తెలియుటకు మాత్రమేయని తెలుసుకుంటూనే వుందాం. దాని వివరణ యే మంత్ర పుష్పం వివరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి