ఇంద్రియములను నిగ్రహించడం, మనస్సును అదుపులో పెట్టుకోవడం, తపస్సు చేయడం అంటే అనుకున్న పనిని ఒక తపస్సు లాగా శ్రద్ధాభక్తులతో చేయగలగాలి, శరీరాన్ని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం, తన జీవనానికి కావలసిన వరకే సంపాదించుకోవాలి కాని ఎక్కువ సంపదలు, సుఖాల జోలికి పోకూడదు. శరీరమును, మనస్సును శుచిగా ఉంచుకోవడం, ఓర్పువహించడం, కపటం లేకుండా, సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండటం, త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులో అనుకున్నది, మాటలతో చెప్పేది, చేతలతో చేసేది ఒకే విధంగా ఉండాలి. నిరంతరం వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, తద్వారా జ్ఞానం సంపాదించడం, సంపాదించిన జ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకొని, ఇతరులకు మార్గదర్శకం చేయడం, దేవుడిని నమ్మడం, వేదముల మీద, శాస్త్రముల మీద నమ్మకం కలిగి వాటిని నిరంతరం అధ్యయనం చేయడం, గురువు గారి యందు భక్తి కలిగి ఉండటం, ఇవి అన్నీ బ్రాహ్మణులు ఆచరించవలసిన కర్మలు. ఈ కర్మలన్నీ బ్రాహ్మణునికి స్వభావ సిద్ధంగా పుట్టినవి. ఈ కర్మలు ఆచరిస్తేనే అతడిని బ్రాహ్మణుడు అని
స్థూలంగా చెప్పాలంటే వేదములను, శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిని ఆచరించడం, వాటిని శిష్యులకు బోధించడం, ఆ విధంగా వేదవిజ్ఞానాన్ని గురుశిష్య పరంపరగా, తల్లితండ్రులు తమ కుమారులకు ఇచ్చే వారసత్వసంపదగా తరతరాలుగా వ్యాప్తి చెందించడం, మానవులను ధర్మమార్గంలో నడిపించడం..దీనినే బ్రాహ్మణ కర్మలు అని అంటారు. ఇవి చేయని వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినా, కర్మరీత్యా, స్వభావ రీత్యా బ్రాహ్మణుడు కాడు అనే విషయం చెప్పనక్కరలేదు.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి