16, ఫిబ్రవరి 2023, గురువారం

కళాప్రపూర్ణ

 Telugu people always remember this great legend for generations 🙏

నేడు "కళాప్రపూర్ణ" "చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి" గారి 72 వ వర్ధంతి. 


"జండాపై కపిరాజు", "బావా ఎప్పుడు వచ్చితీవు", "చెల్లియో చెల్లకో", "అలుగుటయే ఎరుంగని", "తమ్ముని 

కొడుకులు", "సంతోషంబున సంధిచేయుడు" అనే ప్రసిద్ధిగాంచిన పద్యాలు గుర్తుండే ఉంటాయి.

ఇవి రచించిన జంటకవులలో వారే "శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారు.


చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి

జననం : ఆగస్టు 8, 1870, కడియం

మరణం:  15 ఫిబ్రవరి 1950

ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు", "జంట కవులు"


ప్రసిద్ధి: తెలుగు కవిత్వం, నాటకాలు, అవధానం (ప్రప్రథమ శతావధాని), పాండవ జనన- ఉద్యోగ - ప్రవాస  - అశ్వమేధ  - విజయాలు , శ్రీ కృష్ణ రాయబారం, కాశి  యాత్ర, శ్రవణానందం, జాతక చర్య, ఇటీవలి చర్య , కింగ్ జార్జ్ V పట్టాభిషేక పద్యాలు, మృత్యుంజయ స్తవము మరెన్నో....


వీరు రచించిన పద్యాలు, నాటకాలు ఎన్నో తెలుగు చలన 

చిత్రాలలో వాడుకున్నారు.


"సూపర్ స్టార్" కృష్ణ నిర్మించి నటించిన "కురుక్షేత్రం" చిత్ర  శీర్షికలలో "చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారి పేరు వేసి గౌరవించారు.


#చెళ్లపిళ్లవేంకటశాస్త్రి, #తిరుపతివెంకటకవులు, #జంటకవులు, #తొలిఆస్థానకవి,

కామెంట్‌లు లేవు: