16, ఫిబ్రవరి 2023, గురువారం

ఉద్యోగుల* *పరిస్థితి*

 *ఉద్యోగుల* *పరిస్థితి* 

*ఒకడు తన కష్టాలు గట్టెక్కే మార్గం కోసం పొరుగూరు లో ఉన్న యోగి ని కలవడానికి అడవి మార్గం గుండా బయలుదేరాడు . ఒకరోజుకి సరిపడా నీళ్లు పట్టుకున్నాడు . అయితే అడవిలో దారి తప్పాడు . ( *ఇప్పుడు అతని మొదటి లక్ష్యం యోగిని కలవడం కాదు . అడవి లోనుండి బయటపడడం* ) *బాగా దాహం వేసింది . నీళ్ల సీసా తీద్దాం అని సంచిలో చేయి పెట్టాడు . సీసా లేదు ఎక్కడో పడిపోయింది . గొంతు ఎండిపోతుంది . ప్రాణం పోతున్నట్టు ఉంది . ( *ఇప్పుడు అతని లక్ష్యం దారి కనుక్కకోవడం కాదు . దాహం తీర్చుకోవడం* ) . *ఇంతలో ఎదురుగా పులి కనిపించింది . గబుక్కున ఒక చెట్టెక్కేసాడు . చెట్టు కింద పులి . అలా నాలుగు గంటలు ఉన్నాడు . దాహం మర్చిపోయాడు . ( *ఇప్పుడు అతని లక్ష్యం పులి నుండి తప్పించుకోవడం మాత్రమే* ) . *పులి వెళ్ళిపోయింది . జీవితంలో ఎప్పుడూ లేని ఆనందంతో చెట్టు దిగాడు . ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అంతే మనకు రావలసిన అన్ని *బకాయిలు , ఎరియర్స్ , DA లు విడిచిపెట్టి జీతం పడితే చాలు మహా ప్రభో* *అనే విధంగా ఉద్యోగుల ఆలోచనను తీసుకొచ్చారు* .

కామెంట్‌లు లేవు: