*చిన్న కథ:*
ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది....
ఏడుస్తూ 8 "నన్నెందుకొట్టావని?" 9ని అడిగింది.
"నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా.." అని 9 చెప్పింది.
అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.
అలాగే
ఏడు 6ని,
ఆరు 5ని,
ఐదు 4ని,
నాలుగు 3ని,
మూడు 2ని,
రెండు 1ని లెంపకాయలు వేశాయి.
1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన ముందు నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.
....
....
....
జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.
So Don't Lose Your Good Relationships With Few People.. ఇలా పక్కన నిలబడి మన విలువను పెంచే వారిలో మొదటగా ప్రాణ స్నేహితులే ఉంటారు🤝🤝..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి