శివరాత్రి విషయములో వదంతులు నమ్మవద్దు...
పుష్కర పుష్కరకాలానికి వస్తోంది అని చెబుతున్నది అబద్దం..
శనివారం మహాశివరాత్రి రావడం చాలా సహజం,
అందునా శని త్రయోదశీ ప్రదోషం శివరాత్రి కలిసి రావడం కూడా మరీ 144 సంవత్సరాలకు ఒకేసారి వస్తోంది అనడం కూడా అబద్దం
మామూలుగా వచ్చే విషయమే....కింద 1800 నుండి 2300 వరకూ వచ్చిన మహాశివరాత్రులలో శనివారం శనిత్రయోదశీ కలిసి వచ్చిన వివరాలు ఇచ్చాను, ఉదయకాల త్రయోదశీ, ప్రదోష కాల త్రయోదశీ వివరం కూడా ఇవ్వడం జరిగినది.. అలా ఎన్ని సార్లు వచ్చాయో పాఠకులు గమనించవచ్చును..
ఇక అడ్డమైన టీవీ లైవ్ లలో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు..
మహాశివరాత్రి నియమం వేరు
శనిత్రయోదశీ (శని ప్రదోషం) నియమం వేరు... ఉదయ వ్యాప్తి, ప్రదోష వ్యాప్తి రెండింటికీ రెండు వేరు వేరు నియమాలు వ్రతములు ఉన్నవి..
శని త్రయోదశీ ఉదయకాలం, ప్రదోషకాలం ఉన్న రెండింటి గురించి వివరం భవిష్యోత్తరంలో, స్కాందంలో చక్కగా చెప్పారు, రెండింటిలో ఈశ్వరారాధన చేయాలి అని...
అలాగే మహా శివరాత్రి కి కూడా ఈశ్వరారాధన చేయుట ప్రధానం.
అష్టయామములలో అలాగే లింగోద్భవ కాలములో కలిపి తొమ్మిది పూజలు ఆచరించుట శివరాత్రి నియమం లేదా శివరాత్రి వ్రతం...
కనుక ఎవరిని ముందు పూజించాలి
మొదట ఏంచేయాలి అని, లేదా లేనిపోని హంగులు, టీ,ఆర్,పీ రేటింగ్ ల కోసం చెప్పే అబద్దాల వీడియోలతో లైవ్ ల గోలతో కాలయాపన చేయక....
పరమాత్మను మనస్సు యందు స్మరిస్తూ యథాశక్తి పరమాత్మ ఆరాధన లో ఉండటం శ్రేష్ఠం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు
జగదంబశివే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి