1.'బాబాయి,చిన్నాన్న' రెండూ తెలుగు పదాలే.'బాబాయి' అనేది కోస్తా ప్రాంతంలోనూ, 'చిన్నాన్న,చిన్నాయన' అనేవి ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలోనూ వాడుకలో ఉన్నాయి.
2.హిందీ/ఉర్దూ ప్రభావాలతో తెలంగాణలో తండ్రిని
'బాపు' అని,చిన్నాయనను 'చినబాపు'అనీ, పెదనాన్నను 'పెదబాపు'అనీ, నాయనమ్మను 'బాపమ్మ' అనేవాళ్ళు ఇంకా ఉన్నారు.
3.ఈ క్రమంలోనే 'బాపూ కా
భాయీ'(తండ్రి సోదరుడు)
అనే అర్థంలో 'బాబాయి' వచ్చి ఉంటుందేమో! అని నా ఆలోచన.
4.అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకవేళ 'బాపూ కా భాయీ' అనే పదాలలోంచే 'బాబాయి' వచ్చిఉంటే అది 'పెదనాన్న' కు కూడా వర్తించాలి.కానీ వర్తించదు. కేవలం పిన తండ్రి-అనే అర్థానికి మాత్రమే ఇది పరిమితం అయింది.ఇదీ సమస్య.
5.దీనికి తోడు ఉర్దూ,హిందీ ప్రభావం తక్కువగా ఉండే కోస్తా జిల్లాలలోనే 'బాబాయి' పదం వ్యవహారంలో ఉండడం ఆశ్చర్యకరం.
6.బాబాయి,చిన్నాయన పదాలకు సమానార్థకంగా ఉత్తరాంధ్రలో ఏమంటారో తెలియదు.రావిశాస్త్రి గారి రచనలను చదివితే ఇవి తెలిసే అవకాశం ఉంది. మరోసారి చదువాలి.
7.ఉర్దూలో తండ్రిని 'అబ్బా/ అబ్బాజాన్'అని, తల్లిని 'అమ్మి/ అమ్మీ జాన్' అని, సోదరుడిని 'భాయీ జాన్'అని గౌరవంగా పిలవడం ఉంది.
8.ఈ ప్రభావంతోనే కావచ్చు -తెలంగాణ ప్రాంతంలో కూడా కొద్దిమందిలో తండ్రిని 'అబ్బా!' అని పిలవడం ఉంది.
9.'నీ అయ్య=నీయబ్బ' అని వాడుకలో ఉంది కదా!
10.తిరుపతి ప్రాంతంలో కాబోలు కొన్నిచోట్ల 'చిన్నబ్బి/సినబ్బి' అనడం విన్నాను.
అయితే ఈ పదాలకు 'చిన్నవాడు' అనే అర్థం కూడా ఉంది.
11.తెలంగాణలో హిందీ/ఉర్దూ ప్రభావంతో ఇప్పటికీ కొంతమంది చిన్నాయనను 'కాకా' అని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి గారిని 'కాకా'
అనడం అందరికీ తెలిసిందే కదా!
12.ఉత్తరాదిలో చిన్నమ్మను 'కాకీమా'(కాకా భార్య) అనీ, మేన'మామ' భార్యను 'మామీ' అని అంటారు/
పిలుస్తారు.
-మోతుకూరు నరహరి
చాలా చక్కటి విషయం బాగ విశదీకరించారు...
గుజరాత్ లో. ఉత్తరప్రదేశ్ లో బాబాయ్ చిన్నని కాక అనీ సంబోధన చేస్తారు. పెదనాన్న ని తావుji అని అంటారు. చిన్నాన్న అబ్బాయి ని
bhateeja అని .మామయ్య ని మామji అని తండ్రి అక్క చెల్లెలిని చోటిఫuphi అనీ బడిphoophi అని అక్కయ్య చెల్లెల కొడుకు ని bhanjha అని అమ్మాయిని bhanjhi అని అంటారు..గుజరాత్ లో కూడా ఈ పదాలనే వాడుకలు ఉన్నాయి కానీ sourastra ప్రాంతమంతా కొంచం karachi పాకిస్తాన్ ఉర్దూ పదాలు వాడే అలవాట్లు అలాగే ప్రతి పేరు వెనకాల ని అనే సంబోధన సింధి భాష ప్రయోగం చేస్తారు. ఉదాహరణకు Adani. AMBANIS. అద్వానీ. వారు sourastra ke చెందిన వారు పటేల్ లు మోడీ అని సంబోధన లో ఉన్నాయి..మన శ్రీకాకుళం Vishakha .విజయనగరం లో చిన్ననా.గారు. పెదనాన్న గారు అనీ sane సంబోధన లు ఉన్నాయి...
తల్లి చెల్లెలు అక్కయ్య లను పిన్ని గార ని చిన్న పిన్ని పెద్ద పిన్ని గారు అనే సంబోధన ఉన్నది...ప్రతి ప్రాంతాలను భారత దేశం లో చూస్తే అనుసరిస్తున్న విధానాలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి.కానీ వారి మాటలు ఉచ్చారణలో సంబోధన లో వ్యత్యాసం
చూడవచ్చు..గురువులకు ధన్యవాదాలు. Kritagnatalu
ప్రభాకర్ భట్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి