శ్రీ గురుభ్యో నమః
సద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమః
శ్రావణ మాసం లక్ష్మీ, గణపతి, సుబ్రహ్మణ్య, ఈశ్వర, నారాయణ ప్రాధాన్య మాసం. ఈ మాసం లో వచ్చే శుక్ల పక్ష పంచమి శ్రీ వర మహాలక్ష్మి ఆవిర్భావ దినోత్సవం గా ప్రసిద్ధి.
శ్రావణ శుక్ల పక్ష సప్తమి విశేష మైన మంత్ర ప్రాధాన్య తిథి గా ప్రసిద్ధి.
కామాఖ్య దేవి ఆలయం లో చేసుకున్న శత చండి హోమం పిదప zఆ క్షేత్ర పాలిక అయిన శ్రీ భగళముఖి అమ్మ వారి క్షేత్రం లో అమ్మ వారి అనుగ్రహం, ధర్మ రక్షణ, ఏర్పడిన ప్రభుత్వము ధర్మ రక్షణ లో భాగస్వామ్యం అవ్వాలి అని, విదేశీ వ్యూహ రచన పటిమ నిర్వీర్యం అయి మన దేశం లో ధర్మం ఆచరించి క్షేమంగా కాపాడాలి అని ప్రార్థన తో మన దేశం లో నివసిస్తున్న యతి వరేణ్యులు, గోవులు సంరక్షింప బడాలి అన్న సంకల్పంతో జగద్గురువులు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీ మదభినవోద్ధండ శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారి అనుగ్రహం మరియు అనుజ్ఞ తో ఛందోలు గ్రామం లో వేంచేసి యున్న శ్రీ భగళముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణం లో మూల మంత్ర హవనం విశిష్ట ద్రవ్యం లతో చేయుట జరిగినది.
ముందుగా ఆలయం లో అమ్మ వారి మూల విరాట్టునకు నాచే పూజ చేయించి అమ్మవారి శ్రీ చక్రమునకు కుంకుమ పూజ చేయించి పిదప నివేదన ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వడం అమ్మ ఇచ్చిన అనుగ్రహం గా భావిస్తున్నాను. అటు పిమ్మట శ్రద్ధ ఆసక్తి తో విశేష సంకల్పం తో మూల మంత్ర హోమం చేయడం జరిగినది. ఆలయం EO గారు శ్రీ నరసింహమూర్తి గారు చక్కటి భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం తో అమ్మ సన్నిధి లో ప్రసాదం స్వీకరించి అటు నుండి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఇంటిని దర్శనము చేసుకుని విజయవాడ మీదుగా తాడేపల్లిగూడెం చేరుకున్నాము. ఒక అద్భుతమైన భావన తో ఆనందం తో చేసుకున్న ప్రయాణం గా భావన. ఈ హోమం చేసే సమయం లో కొన్ని ద్రవ్యాలు కోసం ఎంత వెదికినా దొరకక పోవడం మిగిలిన విశిష్ట ద్రవ్యములతో ఈ హోమం చేయడం జరిగినది.
మన సమూహం లో శ్రీ జగన్నాథ శ్రీ చరణ్ మరియు శ్రీ శ్రీపాద భాస్కర శర్మ గారు అనుకోని అవాంతరం రావడం తో చందోలు గ్రామ హోమానికి రాలేకపోయారు. వారు మరుసటి ఉదయం తాడేపల్లిగూడెం ఉదయమే చేరుకోవడం కడు ఆనంద దాయక విషయం.
తాడేపల్లిగూడెం లో శ్రీ లలితాదేవి ఆలయ యాజమాన్యం నూతనం గా నిర్మించిన యాగశాల ప్రారంభం శ్రావణ మాసంలో జరగాలి అని అమ్మ సంకల్పం. ఇతః పూర్వం తాడేపల్లిగూడెం లో రాజకీయ వ్యవస్థ అర్హులైన వారికి రావడం కోసం ఇదే ఆలయం లో.చేసిన విశేష మైన హోమం అందుకు అమ్మ వారు ఇచ్చిన శుభ ఫలితం నకు అమ్మ వారికి కృతజ్ఞత తెలుపుకునే ఒక బాధ్యత లో ఈ శ్రావణ మాసం లో భాను సప్తమి శుభ పర్వదినం నాడు అమ్మవారి ఆశీస్సులతో విశేషమైన తామర పూవులతో లక్ష్మీ యాగం, పంచ సూక్త హోమం మరియు నవగ్రహ మరియు నక్షత్ర హోమం సంకల్పం చేయడం జరిగినది. అయితే అనూహ్యంగా ముందు రోజు మేము వెతికిన విశిష్టమైన పసుపు సంపెంగ పూవులు అక్కడికి వచ్చిన భక్తులు తీసుకు రావడం ఆశ్చర్యంనకు లోను చేసింది. అందుకు తోడుగా స్వాతి నక్షత్రం అవ్వడం చేసి నవగ్రహ, నక్షత్ర, పంచ సూక్త సహిత మూల మంత్ర సంపుటిత శ్రీ లక్ష్మీ యాగం, అమ్మ వారి మూల మంత్ర హోమం మరియు లక్ష్మీ నృశింహ మూల మంత్ర హోమం చేయడం ఎంతో తృప్తి ఆనందం కలిగించింది.
వచ్చిన భక్తులు అందరూ ఎంతో శ్రద్ధ ఆసక్తి తో కార్యక్రమం లో భాగ స్వామ్యం తీసుకోవడం... అంతే శ్రద్ధ గా అక్కడ ఏర్పాట్లు చేయడం చక్కటి భోజన ప్రసాద వితరణ జరగడం మొత్తం వేసిన విశేష ద్రవ్యములు అన్నీ ఆహుతి కావడం, మూల మంత్ర హోమం ప్రారంభం అయిన పిదప అఖండ తేజస్సు తో వేడి ఆ ప్రాంతాన్ని ఆ అవహించడం అమ్మ ఉనికి కి సోపానంగా భావన చేసుకుంటూ...
ఇంతే శ్రద్ధ, అనురక్తి, ఆధ్యాత్మిక సౌరభం తో మరిన్ని లోక కళ్యాణ హిత కార్యక్రమాలు చేసే శక్తి గురుదేవులు మరియు అమ్మ వారు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ...
ఈ కార్యక్రమం లో అనూహ్యంగా చెన్నై నుండి సకుటుంబ సమేతంగా అటు శని ఆదివారాల్లో జరిగిన రెండు హోమాలకి వచ్చిన శ్రీ వేంకట రామ శర్మ గారు మరియు శ్రీమతి జయంతి గారి దంపతులకి పిల్లలకి, మా బ్రహ్మ గారు శ్రీ తారక రామ శర్మ గారు, ఉపాసకులు శ్రీ సుందర రామారావు గారు, శ్రీ వేంకట రాధాకృష్ణ శర్మ గారు ఆదివారం హోమానికి శ్రమ అని భావించకుండా భాగ్యనగరం నుండి ప్రత్యేకంగా వచ్చి కార్యక్రమం దిగ్విజయం అవ్వడం లో సహకారం ఇచ్చిన శ్రీ శ్రీపాద భాస్కర శర్మ గారు మరియు శ్రీ జగన్నాథ శ్రీ చరణ్ గారికి తాడేపల్లిగూడెం ఆలయ యాజమాన్యం నకు శతధా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ... మహత్తర సత్కార్య నిర్వహణ శక్తి అమ్మవారు ప్రసాదించాలని ప్రార్థిస్తూ
సూర్య కిరణ శర్మ మల్లాది
హరితస ధార్మిక సేవా సంస్థ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి