13, ఆగస్టు 2024, మంగళవారం

జీవనాధారం

 జై శ్రీమన్నారాయణ..



మనిషికి పని జీవనాధారం. పని కేవలం జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. తెలివికి, సృజనకు అది పట్టం కడుతుంది. పని ద్వారా పొందే ఫలితం మానవుడికి గొప్ప సంతృప్తినిస్తుంది. లోకంలో పనిని ఎంతగానో ప్రేమించేవారు ఉంటారు. సృష్టిలో ఏ పనైనా ముఖ్యమైనదే. పనిలో చిన్నది, పెద్దది అన్న తారతమ్యం ఉండదు. వివిధ రంగాల్లో మానవ కార్యనిర్వహణ జగతిని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. లోక కల్యాణ కారకమవుతుంది.


మనిషి కాయకష్టం చేయడానికి కావాల్సిన శక్తిని ఆహారంతో అందించే రైతు ప్రపంచంలో ప్రథమపూజ్యుడు. మరణపు అంచులకు చేరుకున్న వ్యక్తిని పునర్జీవింపజేసే వైద్యుడు నరలోక నారాయణుడు. సరిహద్దు రేఖ దాటకుండా శత్రువులను కట్టడి చేస్తూ, ఆ క్రమంలో పాణత్యాగానికైనా సిద్ధపడే సైనికుడు ప్రాతఃస్మరణీయుడు.


ఏ పనికైనా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు నాంది పలుకుతాయి. పనిపట్ల చూపే శ్రద్ధ జీవికి జీవితాన్నిస్తుంది. కార్యదక్షత మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలంటారు అనుభవజ్ఞులు. విద్య ఏర్పరచే పనిబాట సర్వత్రా గౌరవనీయం, పూజనీయం అవుతుంది...

కామెంట్‌లు లేవు: