👆శ్లోకం
గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ
వాచస్పతి రుదారధీః||
ప్రతిపదార్ధ:
గురుర్గురుతమః - గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;
గురుః -సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;
గురుతమః -ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.
ధామ -పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.
సత్యః -మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.
సత్యపరాక్రమః -నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.
నిమిషః -యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)
అనిమిషః -ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.
స్రగ్వీ -వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.
వాచస్పతిః -వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.
ఉదారధీః -ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.
వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి