పెండ్లికల
పరతత్త్వనిర్ణయము
ఉ॥
వేదములున్ తదంతములు విశ్రుతధర్మపరేతిహాసశా
స్త్రాదులు గూఢతత్వవిషయ
మ్ములనున్ కలలోన దెల్పిసం
వాదము నందు పండితసభన్
పరతత్త్వము తానటంచునా
మోదము జేయ నంపె హరి ముచ్చటదీరగ,విష్ణుచిత్తునిన్
69
తే.గీ||
అంత ప్రణమిల్లి భాగవతార్యుడపుడు
పండితసభకు జనె పరివారజనము
వెంటరా, నెదురేగి యా విభుడు నమ్ర
శీర్షుడై తద్విజోత్తము జేర్చె పీఠి 70
తే.గీ॥
అచట సభ నొక్క ప్రజ్ఞాని యాదిశక్తి
యే పరమతత్త్వమనుచు వాదించి మెరిసె
మరొక డనలాంబకపరత్వ
మహిమ దెలెపె
వేరొకండట నలువయే వేల్పుడనియె 71
సీ||
విష్ణుచిత్తుడపుడు విష్ణుపరత్త్వమున్
భాష్యాలు ఘటియించి వ్యక్త పరచె
ఉపనిషత్తుల లోని యుపపత్తులను జూపి
బోధాయనోక్తుల పోహణించె
ఇతిహాసకథలతో ప్రతివాదమును సల్పె
సారమ్ము ననువున జక్క జూపి
మోహులై కనువారు ముగ్ధులై రనినచో
నదియె వైష్ణవమాయ యనగ నొనరె
తే.గీ॥
వివిధగాధామయ పురాణవేత్తయగుచు గూఢపరమార్థముల నెల్ల కూర్చి నుడువె
వాదమున కెవ్వడును ప్రతివాది లేక
ఒక్కొక విషయమ్ము నిటుల నుగ్గడించి 72
కంజర్ల రామాచార్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి