14, డిసెంబర్ 2025, ఆదివారం

విష్ణు స్తు తి

  🌸విష్ణు స్తు తి


శంఖచక్రములును సకిరీట మునుగల

వైకుంఠవాసుడావందనాలు

మా మొరలు వినవా మాధవ శ్రీహరి

కరుణతో మమ్ముల కావుమయ్య 

దుష్టుల శిక్షించి దురితములను బాపు

 దామోదరా నీకు దండ మయ్య 

నీల మేఘశ్యామ నిరుపమ గుణధామ

నిన్ను నమ్మియుంటినినిచ్చలందు

తే, ధర్మ పాలన జేసెడి ధర్మవీర

సకల దేవతా పూజిత శరణు శరణు

 విన్నపాలువినుము దేవ విష్ణుమూర్తి

 మానవుల పైన దయ చూపు మమత తోడ 


సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

కామెంట్‌లు లేవు: