🌹🦜🙏🏽🦜🌹
12.12.2025
శుక్రవారము
దత్తపది అంశం : భారతార్ధంలో
ఛందము .. ఏదేని వృత్తము
***************************
" *హరి - గిరి - సరి - ఝరి "*
****************************
*ఉత్పలమాల..*
శ్రీహరి నడ్డగింపనట సిగ్గును
వీడుచు నల్లకొల్వులో
ద్రోహులు కౌరవాధములు దూరుచు
మ్రగ్గిరి సంగరమ్మునన్ !
దా హతుడాయె రాజు 'సరి తమ్ముని'
ధాటికి నొక్కపెట్టునన్ !
గోహళి వ్రయ్యలాయె, కురు క్రౌర్యపు
నిర్ఝరి క్రుంకెఁ జూడుమా !!
......................................................
సరి తమ్ముడు ... భీముడు ( సరియగు, సరిజోడు )
గోహళి .. కిరీటము ( రాజ్యము, రాచఠీవి )
నిర్ఝరి ... సెలయేటి ప్రవాహము
(రాచరికము అనే భావములో వాడాను )
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి