🌹🦜🙏🏽🦜🌹
13.12.2025
శనివారం
*అంశం .. చిత్రముపై కవి హృదయం*
..................................................
*ఉత్పలమాల..*
దూకుచునుండె గంగ, శివ! త్రుళ్లుచుఁ
జంపును మమ్మునీ భువిన్!
నీకిది భావ్యమా? జపము నేటికిఁ
జాలును, మేలుకొమ్మయా!
చీకులు తీరు రైతులకుఁ జెర్వుల
నింపిననట్టి నీటితోఁ !
జేకొని మెట్టభూమియును శ్రీల
నొసంగును మానవాళికిన్ !!
................................................
🦄🐓🦜🦢🐘
పి.ఎల్.నాగేశ్వరరావు
హైదరాబాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి