9, జులై 2021, శుక్రవారం

గుణదోష ఫలితాలే


ఈర్ష్య, అసూయ,ద్వేషం అన్నీ గుణదోష ఫలితాలే.

 సూర్యుడు 9 కోట్ల 60 లక్షల మైళ్ళ

నుండి భూమిమీదకు కిరణాలు వెదజల్లుతున్నాడుకదా.

సూర్యుడు వేరు సూర్యకిరణాలు వేరు.

అలాగే పరమాత్మ తనలోని చైతన్యాత్మలొ ఒకే భాగం జీవచైతన్యంగా వెదజల్లుతున్నాడు. 

కిరణాలు వేరైనా సూర్యుడు ఒక్కడే అయినట్లు, చైతన్యాత్మలు వేరు ఉపాధులలొ ఉన్నా చైతన్యం ఇచ్చే పరమాత్మ ఒక్కడే.

నేను, నువ్వు, అతడు, ఆమె అంతా ఒక గూటి పక్షులం. అద్దం మీద మురికి వల్ల మన స్వరూపం 

చూడనట్లే అహంకారం అనే గుణదోషం వల్ల ఈ ఆధ్యాత్మికత్వం

కనుగొనలేకపోతున్నాము.💐

కామెంట్‌లు లేవు: