9, జులై 2021, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 7

 ప్రశ్న పత్రం సంఖ్య: 7                            కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "లం " తో అంతమౌతాయి   

1) ప్రతి వారు శరీరంలో  ఇది వుండాలని కోరుకుంటారు 

2) రామ దాసుకి సంబందించిన క్షేత్రం 

3) ఒక సినీ నటుడు తమిళంలో కూడా నటించాడు 

4) గొడవ లేక హడావిడి 

5) ఇది విషమే 

6) ఒక ప్రసిద్ధ సాహిత్యకారుడు 

7) రైతు మడిలోకి దీనితో వెళతాడు 

8) అప్లికేషన్ ఫోరంలో ఈ కాలం తొలగించి అందరిని సమానంగా చూడాలని కొందరంటారు 

9) వైజాగ్ దగ్గర నరసింహ స్వామి క్షేత్రము 

10) మాంసము 

11) పండు 

12) వానరం తోటి ఉండేది 

13) సమయం 

14)ఇది వినగానే మనకు రమణ మహర్హిగారు గుర్తుకు వస్తారు. 

15) ఈ ఊరు మంచి స్టీలు సమానులకు ప్రసిద్ధి తమిళనాడులో వుంది 

16)  నీటిలో పెరిగే మంచి పుష్పం 

17)  సుకుమారం లాంటిదే 

18)  పూర్వపు ఒక ఆయుధ విశేషం 

19)  అగ్నిహోత్రుడు.

20)  వాయువు 

21) ఈశ్వరుడు దీనిని ధరిస్తారు 

22)  రైతు వ్యవసాయం చేయటానికి ఇక్కడికి వెళుతాడు 

23)  మంచినీటి కోసం ఇసుకలో తీసే గుంత 

24)  నిలకడ లేదు 

25) పట్టిన పట్టు మేము _____

కామెంట్‌లు లేవు: