9, జులై 2021, శుక్రవారం

వాయిదా వద్దు*

 🔔 *వాయిదా వద్దు*🔔


ఒకసారి కర్ణుడు తన ఆంతరంగిక మందిరంలో అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడు. 


ఇంతలో ఓ విషయం మాట్లాడేందుకు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ద్వారపాలకులు సమాచారం ఇవ్వగానే కృష్ణుడిని వెంటనే తన దగ్గరకు తోడ్కొని రమ్మని చెప్పాడు కర్ణుడు. 


కృష్ణుడు అక్కడకు రాగానే ఆయన దృష్టి రాధేయుడి ఎదుట ఉన్న స్నానలేపనాల పాత్రపై పడింది. ఖరీదైన ఆ రత్నఖచిత బంగారు పాత్రను చూసి అబ్బురపడుతూ వివరాలు అడిగాడు. 


వెంటనే కర్ణుడు కృష్ణా! ఇది నీకు అంతగా నచ్చిందా... అయితే నీ మందిరానికి దీన్ని తీసుకెళ్లు... అంటూ ఎడమచేతితో ఇచ్చాడు. ఆ క్షణంలో కర్ణుడి కుడి చేయంతా నూనెలతో మలినంగా ఉంది. దీంతో వామహస్తంతో దాన్ని ఇచ్చాడు. 


🌿అప్పుడు కృష్ణుడు కర్ణా! నువ్వు ఎంతో ఇష్టపడే ఈ పాత్రను వామహస్తంతో ఇవ్వడం భావ్యమా? అని అన్నాడు. 


🌿అప్పుడు కర్ణుడు.. కృష్ణా! చేయి శుభ్రం చేసుకుని వచ్చేలోపు మనసు ఎలా మారతుందో తెలీదు.ఏ మంచిచైనా అనుకున్న క్షణంలో చేయడం మంచిది... అందుకే అలా ఇచ్చాను...


*క్షణం చిత్తం క్షణం విత్తం జీవితమాయయో*

*యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః*


👉ఇప్పుడున్న ధనం మరుక్షణాన మాయమై పోవచ్చు. యమధర్మరాజు ఎవరిపై కరుణ చూపడు.  జీవితం క్షణంలో అంతమై పోవచ్చు. 


👉అందుకే ధర్మాన్ని ఆచరించడం వాయిదా వేసుకోకూడదు. అన్నాడు దాన కర్ణుడు...


*ధర్మో రక్షతి రక్షితః*

🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: