10, అక్టోబర్ 2021, ఆదివారం

పరమతస్తుల దండయాత్రలు

 కొన్ని వందల సం. ల కిందట భూతల స్వర్గం సుందర కాశ్మీర్లో హిందూత్వం వెల్లివిరిసేది. ఆ మంచుకొండల మధ్య కొన్ని వందల దేవాలయాలు, ఉదయాన్నే ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపించే గుడిగంటలు, ఉచ్ఛస్వరంతో వినిపించే వేద మంత్ర ఘోషలు....భారతీయ సంగీత నృత్య శిక్షణలు.... ఇలా ఒకటేమిటి పూర్తి భారతీయత ఉట్టిపడే వాతావరణం వుండేది.


కానీ పరమతస్తుల దండయాత్రలు, ఆక్రమణలతో అన్ని కనుమరుగయ్యాయి. ఈ శతాబ్దంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల వల్ల మిగిలి ఉన్న ఆ కొద్దీ ఆనవాళ్ళు కూడా దాదాపుగా కనుమరుగు అయిపోయాయి. అసలు కాశ్మీరం మాదే. ఎప్పుడూ అది హిందువులది కాదు అనే పరిస్థితికి తెచ్చుకున్నాం.


ఒక ప్రదేశం లో మత పరంగా జనాభా మారితే వచ్చే పరిణామాలు ఏమిటో కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మన కళ్ళముందు ఉదాహరణ. 


మన పూర్వీకులు ఇచ్చిన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకెందుకులే. అది లేకపోతే ఇప్పుడు మనం బతకలేమా అన్న మన ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక రాష్ట్రంలో దాని ప్రాచీన సంస్కృతి దాదాపుగా కనుమరుగు అయింది. దేశంలో ఇతర ప్రదేశాల్లో గల తమ మతస్తులైన ప్రజల నిర్లిప్తత కారణంగా, మద్దత్తు వారికి లభించని కారణంగా కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగిన కొన్ని వేల కుటుంబాలు కట్టు బట్టలతో వారి స్వస్థలాలను విడిచిపెట్టి పోయి ఈ దేశంలోనే కాందిశీకులుగా జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. వారి బాధలకు కారణం మనలో చైతన్యం లేకపోవడమే.


సరిగ్గా ఇటువంటి నిర్లక్ష్య ఆలోచన విధానం ఉండడం వల్లే అతి పురాతన సంస్కృతులైన మాయన్, గ్రీక్, ఈజిప్షియన్, జోరాష్ట్రీయన్ సంస్కృతులు ఆనవాళ్ళు లేక కాల గర్భంలో కలసి పోయాయి. పరమతస్తుల ఇన్ని దాడుల తరువాత కూడా ఈ భారతీయ సంస్కృతి ఇంకా మిగిలి ఉంది అంటే పూర్వీకులు హిందూ ధర్మాన్ని , సంస్కృతిని కూడా సామాన్య ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మలిచిపెట్టడం వల్లే.


అందుకే విదేశీమతాల వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అనుకున్నంతగా మత మార్పిడులు చెయ్యలేకపోతున్నాం అని భావించి ఇక్కడ సాంప్రదాయాలను పద్ధతులను తమ మత విశ్వాసాలకు జోడించి వాటిని అనుకరిస్తు అమాయకులను మోసపూరితంగా మత మార్పిడి చేస్తున్నారు. 


హిందూ ధర్మం లో ఇలాగే పూజించాలి. ఫలానా వారినే పూజించాలి అని లేకపోవడం వల్ల ఎవరి వ్యక్తి గత లేక సామాజిక విశ్వాసాలకు ఆధారంగా వారి ఇష్టదేవతలను తయారు చేసుకోవడం పూజించడం జరుగుతోంది. ఏ ఒక్కరూ ఇతరుల నమ్మకాలని తక్కువ చేసి చూడరు.


అందుకే వీధి వీధికో అమ్మవారు, గ్రామ గ్రామానికో గ్రామ దేవత, అడవుల్లో ఒక్కో కొండ తెగకూ ఒక కొండదేవత.


పట్టణాల నుండి హిందూ ధర్మగురువులు కొండల్లోకి పోయి ఈ పద్దతి తప్పు ఫలానాలాగా పూజిస్తేనే మోక్షం కలుగుతుంది అని బలవంతం పెట్టరు. పట్టణాల వారు అడవులకు పోయినప్పుడు ఆ కొండ దేవతలను కూడా వీరు దండాలు పెట్టుకుని గౌరవిస్తారు అంతే కానీ వారి ఆచార వ్యవహారాలను, కట్టుబొట్టును, వివిధ రూపాల్లో వుండే వారి దేవతా మూర్తులను హేళన చేయడం కానీ విమర్శించడం కానీ చెయ్యరు. అలాగే మీరు ఫలానా శివుణ్ణి, రాముణ్ణి లేదా కృష్ణుడినీ పూజించ కపోతే నరకానికి పోతారని వారిని ఎప్పుడు 

భయపెట్టరు.


అందువల్లే ఈ పవిత్ర భూమి మీద ఇంత వైవిధ్యం వెల్లి విరుస్తోంది.


ఇంత వైవిధ్యం కల ఇక్కడ ప్రజల జీవన విధానం పై పరమతస్తుల దాడి వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎడారుల్లో పుట్టిన ఒకే దేవుడు, ఒకే పద్దతి, ఒకే పుస్తకం అని ఒకే మూస గల క్రిస్టియనిటీ, ఇస్లాం

ఈ వైరుధ్యానికి పెను ప్రమాదంగా పరిణిమించాయి. వీరు అడవుల్లోకి.కూడా పోయి అక్కడ కొండప్రజలను వారి ప్రాచీన సంస్కృతులకు దూరం చేస్తున్నారు.


అది కొండ ప్రాంత నివాసం కావచ్చు, గ్రామం కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు మత ప్రాధిపదికన జనాభా మారితే అక్కడ ప్రాచీన సంస్కృతి కనుమరుగు అవుతుంది.


కాశ్మీర్, ఆఫగానిస్థాన్, పాకిస్థాన్ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు. అలాగే ఈశాన్య ప్రాంతంలో ఎక్కువుగా వుండే కొండజాతుల వారు తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను దాదాపుగా పొగుట్టుకున్నారు. అక్కడ ప్రజలలో 90% మంది క్రిస్టియానిటి లోకి పోయి తమ ప్రాచీన సంప్రదాయాలను, పూజ పద్ధతులకు క్రమంగా దూరం జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ మతం మారిన ప్రజల్లో కూడా తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి అన్న తపన మొదలైంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు గ్రీక్, ఈజిప్ట్ మొదలగు దేశాల్లో కూడా మొదలు అయ్యింది.


ఈ దేశంలో గల ఈ వైవిధ్య వాతవరణం ఇలాగే కొనసాగలి అంటే నిర్మొహమాటంగా వివిధ ప్రాంతాల్లో పాటిస్తున్న మన ప్రాచీన పద్దతులు, సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. 


అయితే దురదృష్టవశాత్తూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన హిందువులలోనే ఒక మేధావి వర్గం వుత్తర, దక్షిణ అంటూ, రాముడు కృష్టుడు అంటూ హిందూవులలో బేధాలు సృష్టిస్తున్నారు. వుత్తరాది వారు వచ్చి దేశం అంతా రాముణ్ణి రుద్దుతున్నారు అనే ఈ మేధావి వర్గానికి ఎక్కడో ఎడారుల్లో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దడం, ఆ మతం మారుతున్న వాళ్ళు ఈ దేశ సహజ సిద్ధ వైవిధ్యానికి దూరం జరుగుతూ ఇక్కడ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ద్వేషించడం వీరి గుడ్డి కళ్ళకు కనిపించదు. 


దేశం అంతా రాముణ్ణి రుద్దినా శివుణ్ణి రుద్ధినా ఈ సనాతనధర్మం లో వుండే వైవిధ్యానికి ఏదీ లోటు వుండదు. ఎందుకంటే ఉత్తరాది కాశ్మీర్ లో శివుణ్ణి పూజించే వాడు దక్షిణాది రామేశ్వరం వచ్చి అదే శివుణ్ణి పూజిస్తాడు, పశ్చిమాన సోమనాథుని, తూర్పున వైద్య నాథ్ నీ కూడా పూజిస్తాడు. అలాగే రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. అందువల్ల ఏ రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి లేదా శివుణ్ణి దేశం అంతా రుద్దడం వల్ల ఈ ధర్మానికి వచ్చే నష్టం లేదు.


అసలు ఈ పవిత్ర నేలలో వుండే వైవిధ్యానికి నిజంగా తూట్లు పొడుస్తున్న ఎడారి మతాల గురించి ఒక్క మాట కూడా మరి ఈ మేధావులు మాట్లాడరు ఎందుకని? 


అందుకే కాబోలు ఒక మిత్రుడు అన్నాడు.

క్రిస్టియన్ లేదా ఇస్లాం లోకి మతం మారిన ఒకరిని కష్టపడి మళ్లీ హిందూ ధర్మంలో తీసుకు రావడం సులభం ఏమో కానీ ఒక మేధావి హిందువుని హిందువుగా మార్చడం చాలా కష్టం.

పరమత హిందూ ద్వేషులు బహిరంగంగా హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అడ్డుకోవచ్చు. కానీ ఈ మేధావి ఉదార హిందువులు కర్రకు చేదపట్టినట్లు పైకి కనిపించకుండా హిందూ ధర్మం లోపల వుండే హిందూ ధర్మాన్ని బలహీన పరుస్తారు జాగ్రత్త అన్నాడు. అవును ఇది నూటికి నూరు శాతం నిజం.


ముఖ్యంగా మనకెందుకులే, ఎవరి పాపాన వారు పోతారు అన్న ఉదాసీనత మనం వదిలించుకోవాలి. ఎవరి మీదా ద్వేషం కానీ శత్రుత్వం కానీ నూరిపొయ్యక్కరలేదు. అదే సమయంలో మన ధర్మానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మన వారిని మనం ఈ విషయాలపై జాగృతం చేస్తే చాలు.


స్వస్తి

.....చాడా శాస్త్రి....

కామెంట్‌లు లేవు: