ఆసక్తితో జవాబులను ప్రయత్నించాలి అని అనుకన్నా యితర గృహ సమస్యలతో వీటిపై సమయాన్ని కేటాయించలేకపోయిన సభ్యబృందానికి, పై ప్రశ్నల జవాబులను వాటి వివరణలతో సహా పొందుపరచడమైనది. గమనించగలరు.
జవాబులతోపాటుగా వివరణలు చదువాలని మనవి.
రావణుడిని చంపాలనుకొన్న శూర్పనఖ కుమారుడెవరు ?
_________________________
(1) కడుపులో అమృతభాండం కలవాడెవరు ?
(అ) విష్ణువు
(ఆ) వశిష్టుడు
(ఇ) రావణుడు✅
(ఈ) నలకుబరుడు
రావణవధ జరగాలంటే అతని కుక్షిలోవున్న అమృతకలశాన్ని చేధించాలనే విభీషనుడి సలహతో శ్రీరాముడు బాణంసంధించి రావణుడి నాభిలోని అమృతభాండాన్ని శిథిలం చేయడంతో రావణవధ జరిగిపోయిందని మనం చిత్రసీమలో చూశాం.నిజానికి ఈ ఘట్టం మూలకథలో లేదు. తరువాత జరిగిన మార్పులలో చోటుచేసుకొంది.శ్రీరామాంజనేయయుద్ధం, శ్రీకృష్ణార్జునయుద్ధం (గయోపాఖ్యానం) పురాణపురుషులు శాకాహారులని చెప్పడం ఇలాంటిదే.అయితే ప్రతి మార్పు మంచిసందేశాన్ని లోకానికి అందించాయి.
(2) శ్రీరాముడి సోదరి పేరేమిటి ?
(అ) దశరథి
(ఆ) శాంత✅
(ఇ) సుకన్య
(ఈ) రూప
వివరణ: - అయోధ్యరాజు దశరథుడు, అంగరాజు ఇద్దరూ రోమపాదుడు బాల్యమిత్రులు. రోమపాదుని భార్య వర్షిణి. ఈమె కౌసల్యకు సోదరి.దశరథకౌసల్యల తనయ శాంత. పిల్లలులేని రోమపాదునికి శాంతను దశరథుడు దత్తత ఇవ్వడం జరిగింది.
(3) "లక్షణ" దుర్యోధనుని కూతురు.లక్షణను పెండ్లాడిన శ్రీకృష్ణుని కొడుకెవరు ?
(అ) సాంబుడు✅
(ఆ) ప్రద్యుమ్నుడు
(ఇ) సుధేష్ణుడు
(ఈ) చారుచంద్రుడు
వివరణ : - శ్రీకృష్ణజాంబవతుల కొడుకే సాంబుడు.దుర్యోధనుడు తనకూతురైన లక్షణ వివాహాం చేయాలని స్వయంవరం ప్రకటించగా, సాంబుడు లక్షణను ఎత్తుకుపోతాడు.సాంబుని కౌరవులు అడ్డగించి సాంబుని బంధిస్తారు.దీంతో కోపించిన బలరాముడు హస్తినకు వస్తాడు. దుర్యోధనుడు గురువైన బలరాముడిని ఆహ్వానించి మర్యాద చేస్తాడు. బలరాముని సూచనతో సాంబలక్షణల వివాహన్ని దుర్యోధనుడు జరిపిస్తాడు.యాదవ వంశ వినాశనానికి సాంబుడే కారణం.
(4) గంధమాదనపర్వతం ఎక్కడుండేది ?
(అ) కిష్కింధ
(ఆ) దండకారణ్యం
(ఇ) నేటి గోండ్వానాప్రాంతం✅
(ఈ) శ్రీలంక
(5) కాశీవిశ్వేశ్వరుని సతి పేరేమిటి ?
(అ) అపర్ణ
(ఆ) మీనాక్షి
(ఇ) కాత్యాయని
(ఈ) అన్నపూర్ణ✅
వివరణ : - కాశీఅన్నపూర్ణ దేవికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. హిందూగ్రంథాల ప్రకారం ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతోసహా అన్నీమాయేనని అంటాడు. భక్తుల ఆకలినితీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలునచ్చక కాశీవిడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారందొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలనుచూడలేని అమ్మవారు తిరిగివచ్చి అందరి ఆకలినితీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తనమాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్నిఅడిగినట్లు చెబుతారు. అప్పటినుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్మకం.
(6) ఇంద్రుడి ఉద్యానవనం పేరేమిటి ?
(అ) ఇంద్రవనం
(ఆ) బృందావనం
(ఇ) నందనవనం✅
(ఈ) పారిజాతవనం
(7) కాశీలో ఒకతను హరిశ్చంద్రమహరాజును దాసునిగా పొందాడు. ఎవరతను ?
(అ) కాలకౌశికుడు
(ఆ) వీరదాసుడు
(ఇ) కాలకౌక్షేయుడు
(ఈ) వీరబాహువు✅
వివరణ :- విశ్వామిత్రుని కోరికపై యమధర్మరాజే వీరబాహువుగా అవతరించి, హరిశ్చంద్రమహరాజును దాసునిగా కొన్నాడు.
(8) శ్రీకృష్ణుడు చంపిన కువలయాపీడము ఏమిటి ?
(అ) బకం
(అ) రాక్షసి
(ఇ) సర్పం
(ఈ) ఏనుగు✅
వివరణ : - కంసుని దగ్గరున్న మధించిన ఏనుగుపేరు కువలయపీడం. ఎంతటి బలశాలినైనా చంపగలశక్తి దీనికుంది. మధురానగరంలో శ్రీకృష్ణ బలరాములు విహరిస్తున్నపుడు వారిని చంపాలనే ఉద్దేశ్యంతో కంసుని ఆనతితో మావటి ఆ కువలయాపీడాన్ని వారి పైకి ఉసిగొల్పాడు. కాని శ్రీకృష్ణుని చేతిలో చచ్చింది.
(9) ద్రౌపతి వస్త్రాపహరణం ధర్మసమ్మతం కాదని వాదించిన దుర్యోధనుడి తమ్ముడెవరు ?
(అ) వికర్ణుడు✅
(ఆ) దుశ్చలుడు
(ఇ) విరోచనుడు
(ఈ) వికర్ణకుడు
వివరణ: - వికర్ణుడు దుర్యోధనునికి రెండవతమ్ముడు, అంటే కౌరవులలో మూడవవాడు. నిండుసభలో ద్రౌపదిమానభంగం తప్పని వాదించినవాడు ఇతనే.మహభారతయుద్ధంలో కౌరవనాశనం తప్పదని ఇతనికి తెలుసు. అయినా రక్తబంధానికి కట్టుబడి భీమునిచేతిలో పదనాల్గవరోజున మరణించాడు. వికర్ణుని చంపినందుకు భీముడు ఎంతగానో దు:ఖించాడు.
(10) రావణుడిని చంపాలని తపస్సు చేసిన రావణుడి మేనల్లుడు (శూర్పనఖ కొడుకు) ఎవరు ?
(అ) ఘంటాకర్ణుడు
(ఆ) జంబుమాలి
(ఇ) జంబుకుమారుడు✅
(ఈ) జంబుకేయుడు
వివరణ : - విద్యుజిహ్వుడు కాలకేయవంశానికి చెందినవాడు.ఇతని భార్య రావణసోదరి శూర్పనఖ. కాలకేయులతో జరిగిన యుద్ధంలో రావణునిచేత పొరబాటున విద్యుజిహ్వుడు మరణించాడు. అప్పుడు శూర్పనఖ ఆరునెలల గర్భిణి. శూర్పనఖ తనకు జరిగిన పతీవియోగం గురించి రావణుడిదగ్గర వాపోగా, రావణుడు మారీచసుబాహువులను తోడుగా ఇచ్చి, దండకారణ్యంలో హాయిగా బ్రతకమని చెప్పాడు. శూర్పనఖకు జన్మించినవాడే జంబుకుమారుడు. యుక్తవయస్కుడైన జంబూకుమారుడు తన మేనమామే తండ్రి మరణానికి కారణమని తెలుసుకొని, రావణసంహారానికి శక్తి కావాలని పంచవటిలో తపస్సు వెళ్ళాడు. అప్పటికే పంచవటిలో శ్రీరాముడు సీత, లక్ష్మణులతోవున్నాడు.ఒకరోజు దర్భలకోసం లక్ష్మణుడు ఆ అడవిలో బాగా గుబురుగా పెరిగిన కత్తితో నరుకుతాడు. ఆ పొదలలో తపంలోవున్న జంబూకుమారిడి తల తెగిపడుతుంది.అంతటి జంబూకుమారుడి జీవితం ముగుస్తుంది.
___________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి