15. గుణో భూషయతే రూపం శీలం భూషయతే కులం
సిద్ధిర్భూషయతే విద్యాం భోగో భూషయతే ధనమ్.
రూపానికి గుణమే అందాన్నిస్తుంది. మంచి నడవడిక కులానికి అందాన్నిస్తుంది. సద్బుద్ధి సిద్ధించటమే విద్యకు అందాన్నిస్తుంది. భోగాలను అనుభవించటమే ధనానికి అలంకారమౌతుంది.
16.నిర్గుణస్య హతం రూపం దుఃశీలస్య హతం కులం
అసిద్ధస్య హతా విద్యా హ్యభోగేన హతం ధనమ్.
సద్గుణం లేని వాని రూపం నశిస్తుంది. చెడు నడవడిక గలవాని కులం నశిస్తుంది. సద్బుద్ధి సిద్ధించనివాని విద్య నశిస్తుంది. భోగిించని వాని ధనం నశిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి