30, సెప్టెంబర్ 2023, శనివారం

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,42,43,44 శ్లోకాలు*


 *యామిమాం పుష్పితం వాచం ప్రవద్యంత విపశ్చితః |* 

 *వేదవా దరతాః పార్థ నాన్య దస్తీతి వాదినః || 42* 


 *కామాత్మానః స్వర్గ పరా జన్మ కర్మఫలప్రదమ్ |* 

 *క్రియా విశేష బహులాం భోగైశ్వర్య గతిం ప్రతి || 43* 


 *భోగైశ్వర్య ప్రసక్తానాం తయాప హృతచేతసామ్ |* 

 *వ్యవసాయత్మికా బుద్ధిః సమాదౌ న విధీయతే  || 44* 


 *ప్రతిపదార్థము* 


యామ్-ఇమాం = ఇవన్నీ; పుష్పితాం = ఆకర్షణీయమైన; వాచం = మాటలు; ప్రవదంతి = అంటారు; అవిపశ్చితః = పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః = వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ = అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి =వేరేది ఏదీ లేదు; ఇతి =ఈ విధంగా; వాదినః = వాదిస్తారు; కామ-ఆత్మానః =శారీరిక సుఖాల కోసం ఆశించి; స్వర్గ-పరాః = స్వర్గ లోకాలని పొంద గోరి; జన్మ-కర్మ-ఫల =ఉత్తమ జన్మ, మంచి ప్రతిఫలాలు; ప్రదాం = ఇచ్చే; క్రియా-విశేష = డాంబికమైన కర్మ కాండలు; బహులాం = చాలా; భోగ =భోగములు; ఐశ్వర్య = ఐశ్వర్యములు ; గతిం =పురోగతి; ప్రతి = వైపున.;భోగ = భోగములు; ఐశ్వర్య = విలాసముల పట్ల; ప్రసక్తానాం = మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; తయా = దాని వలన; అపహృత-చేతసామ్ = దిగ్భ్రమచెందిన బుద్ది తో; వ్యవసాయ-ఆత్మికా = నిశ్చయమైన; బుద్ధిః = బుద్ది; సమాధౌ = సాఫల్యం; న = కాదు; విధీయతే = నిలువదు ;


 *తాత్పర్యము* 


 ఓ అర్జునా ! వివేక హీనులైన జనులు ప్రాపంచిక భోగముల యందే తలమున్కలై ఉందురు.వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్థముల జోలికే పోరు. స్వర్గమునకు మించిన దేదీయును లేదనియు అది ఏ పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు  ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఆ ఇచ్చాకపు మాటల ఉచ్చులలో బడిన భోగైశ్వర్యా సక్తులైన అజ్ఞానుల బుద్దులు భగవంతుడు లక్షణముగా గల సమాధి యందు స్థిరముగా  ఉండవు.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

కామెంట్‌లు లేవు: