*మేనత్త* .. 🌹
అత్త అంటే అనురాగపు భందనం.
ఆ పిలుపులో మాధుర్యం,అనుబంధం.
ఒక భరోసా మరొక ఆత్మీయత.
తండ్రి తరఫు,తండ్రి లో సగం.
మేనత్త ఒక దైర్యం,ఒక బలం.
*తండ్రిని అరే,ఒరే అని పిలిచే బలమైన భంధం*.
*తండ్రి చాటు ఆడపిల్లకు గొంతుక,మేనత్త*.
తండ్రి కి తప్పు,ఒప్పులు చెప్పగల హక్కుదారు.అమ్మకు అర్ధ మొగుడు.నాన్న కు నమ్మకమైన నేస్తం.
నాన్న కష్టం చెప్పుకోగల మనిషి.తాతగారి ఇంటి మహారాణి, బామ్మ గారి గారాల,రాగాల పట్టీ.
నాన్న ఇంటిపేరు పుట్టింటి పేరుగా,నాన్న తో పెరిగిన ఆడబిడ్డ.
*మేనత్త* లందరికీ వందనాలు.
మూర్తి's కలం ✍.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి