13, జులై 2024, శనివారం

తొలి ఏకాదశి

 తొలి ఏకాదశి ఎప్పుడు.?.ఈ రోజున ఏమి చేయాలి.?


హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది..


ఉదయతిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు,సిరి సంపదలు కలుగుతాయి..


* తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి..


* శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి..


* ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉపవాసం పాటించాలి.. అంతే కాదు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి..


* శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి..

కామెంట్‌లు లేవు: