13, జులై 2024, శనివారం

మహనీయుని మాట



🌹 *మహనీయుని మాట* 🌹      


దశరధునిలా పిల్లల్ని ప్రేమించాలి.

సీతలా కష్టాల్లో భర్తకు తోడుండాలి.

లక్ష్మణుడిలా అన్నకు తోడుగా సాయంగా ఉండాలి.

భరతుడిలా త్యాగగుణం కలిగి ఉండాలి.

విభీషణుడిలా మంచి వినయం ఉండాలి.

సుగ్రీవుడిలా మిత్రులకు సాయం చేయాలి.

ఆంజనేయుడిలా కార్య సాధన బుద్ది ఉండాలి.

చివరిగా రామునిలా 

బాధ్యతలను, ధర్మాన్ని,  శౌర్యాన్ని, కలిగి ఉండాలి.

ఇలా ఉంటే ప్రతి ఇల్లు నందనవనం.

ప్రతిరోజు శ్రీరామనవమే!


🌷 *మంచిమాట* 🌷


ఓర్పు ఉంటే కవచాలు అక్కరలేదు, కోపం ఉంటే శత్రువులు అవసరం లేదు,దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు. దుర్జనుడు ఉంటే సర్పాలు అక్కరలేదు. 

మిత్రుడు ఉంటే ఔషధము అక్కరలేదు.


💐💐💐💐💐💐💐💐💐


🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏


        🍁*శుభోదయం* 🌹


🌸 *మహనీయుల మాట* 🌸


నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వుచేసే పనిగొప్పదయితే, ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవానిగా నిలబెడుతుంది.


🌺 *నేటిమంచిమాట* 🌺


జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌹 పంచాంగం 🌹

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ     ... 12 - 07 - 2024,

వారం  ...  భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం -  శుక్ల పక్షం,


తిథి      :   షష్ఠి ఉ10.18 వరకు

                 తదుపరి సప్తమి,

నక్షత్రం  :   ఉత్తర మ2.54 వరకు,

యోగం :   పరిఘము తె4.42 వరకు,

కరణం  :   తైతుల ఉ10.18 వరకు,

                 తదుపరి గరజి రా11.18 వరకు,


వర్జ్యం                 :  రా12.13 - 1.59,

దుర్ముహూర్తము  :  ఉ8.11 - 9.03,

                              మరల మ12.31 - 1.23,

అమృతకాలం     :  ఉ6.55 - 8.42,

రాహుకాలం        :  ఉ10.30 - 12.00,

యమగండం       :  మ3.00 - 4.30,

సూర్యరాశి          :  మిథునం,

చంద్రరాశి            :  కన్య,

సూర్యోదయం     :  5.36,

సూర్యాస్తమయం:  6.35,


                *_నేటి మాట_*


*దివ్యత్వముకు వున్న  ప్రత్యేకత ఏమిటి??*


" సృష్టి , స్థితి ,  లయము!!..." ఈ మూడింటికీ  , ముగ్గురు ప్రధానులు న్నారు!!...

సమస్త జీవుల చేత, సమస్త నియమములను, పాటింపజేయుటే ఈ సృష్టి యొక్క ఘనత. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఈ బాధ్యత అప్పగించబడింది... 

ఈ త్రిమూర్తులకు , అధిపతి దైవము , *ఆయనే GOD*

ఈ ముగ్గురూ కేవలం మినిష్టర్స్ వంటి వారు మాత్రమే...

వారందరి పై, అధికార, ఆధిపత్యము వహించినవాడు, దేవుడు మాత్రమే...

ఈ దైవము, అణు స్వరూపుడై, సర్వత్రా  వ్యాపించి  యున్నాడు. 

ఇతని పేరే ఆత్మ , ఇదే యావత్ సృష్టినంతా పరిపాలన జరుపు చున్నది!!...

కేవలం సాక్షీభూతుడుగా ఉన్నాడు కాని, ఫలము మాత్రమూ మనకు మనమే అనుభవించాలి...

*మరి మనము ఏమి చేయాలి???*

ఈ త్రిమూర్తులతో మనం స్నేహం సంపాదించు కోవాలి, వారిని ప్రసన్నం గావించుకొనే, నిమిత్తమై, నామస్మరణ, జపము, ధ్యానము చేయాలి!!...


దైవము ధర్మ స్వరూపుడు, ఏ రూపమునైనా, ధరించవచ్చు ,  కాబట్టి సాకారం, నిరాకారముగాను కూడా దైవమే ఉంటుంది ( మట్టి, కుండ,లాగ ) ఐతే, మన హృదయము, దైవ భావముతో, సంపూర్ణముగా నింపుకుని, డైరెక్ట్ గా దైవముతోవే సంబంధ బాంధవ్యాలు కల్పించు కోవాలి. 

*ఎలా?*

అదే శరణా గతి, ఇప్పుడు మనం చేసే భజనలు సాధనలు, జపములు , తపములు, అన్నీ ( కోరికలతో చేస్తే )ఒక డిపార్ట్మెంట్ కు మాత్రమే పరిమిత మౌతాయి!!....

(కోరికలు) మన ప్రవర్తన బాగుంటే, ప్రార్థన హృదయపూర్వకముగా ఉంటే, అపుడు దానికి సంబంధించిన "డిపార్ట్మెంట్ కు" తాను తెలియజేసి కర్మ యొక్క, దుష్ట ఫలితాలను రద్దు చేయిస్తాడు!!... 

అదే దివ్యత్వము యొక్క ప్రత్యేకత...


               *_🌹శుభమస్తు🌹_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: