ఒక పక్షి రెక్కలు లేక తినడానికి తిండి దొరక్క తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది
అటుగా ఓ పావురం వెళ్లడం చూసి ఎక్కడకు వెళ్తున్నావ్ అని అడిగింది
స్వర్గానికి వెళ్తున్నాను అని చెప్పడంతో నాగురించి దేవుడికి విన్నవించావా అని వేడుకుంది
అలాగే అని చెప్పిన పావురం అక్కడ స్వర్గపు ద్వారపాలకులతో పక్షి గురించి చెప్పగా
ఆ పక్షి అదే స్థితిలో ఇంకా ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా
పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను అని అడగగా
"నువ్వు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు
అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి వెళ్ళిపోయింది
సరిగ్గా వారం తరువాత పావురం దారిలో వెళ్తూ పక్షిని చూసింది
చెట్టు చిగురించింది
ఎడారిలో నీటి కొలను వచ్చింది
రెక్కలు వచ్చింది పక్షికి
ఇప్పుడు హాయిగా ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది
ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని మళ్ళీ స్వర్గం వైపు వెళ్లి అక్కడ వారిని అడిగింది
ఏడేళ్లు కష్టపడుతుందని అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది
పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది
దాహంతో ఉండగా దేవుడికి కృతజ్ఞత చెప్పింది
ఆకలితో ఉండగా దేవుడికి కృతజ్ఞత చెప్పింది
దేవుడు చలించిపోయాడు జాలి చూపెట్టాడు ఏడేళ్ల తన కష్టాన్ని ఏడురోజులకు తగ్గించేసాడు
అందుకే ఇలా అని
నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం ఉందా
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞత దేవుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి