జగద్విఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు.
ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు.
ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.
సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే.
వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు.
నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట.
నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట.
తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి