🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🪔శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-3🪔*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*బ్రహ్మలోకమున భృగువు*
అది సత్యలోకము, అది మహాసభ, అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారయి వెలుగొందుచుండిరి.
మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మున్నగువారుండిరి, మరియొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులయియున్నారు.
వారికందఱకు సృష్టి విజ్ఞాన సంపన్నుడయిన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములయిన రహస్యముల నెన్నింటినో బోధించుచుండెను.
ఆ సమయమునకు భృగమహర్షి అచ్చటకు వచ్చెను. చరచరా సభను ప్రవేశించినాడు. సభాసదుల నొక్కసారిగా కలయజూచెను.
బ్రహ్మకాని మరెవ్వరుకానితనను కూర్చును’డని అడుగకయే తనంతట తానుగా నా సభలో గల నొక ఆసనము పై గర్వముగా కూర్చునినాడు.
సభాసదులకు భృగుమహాఋషి వచ్చుట వలన కలిగిన ఆనందముకన్న ఆయన ఆ విధముగా కూర్చోనుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగానుండెను.
బ్రహ్మకు భృగుమహర్షి ప్రవర్తన అవమానకరము, సభాసంప్రదాయములను పాటించి పెద్దవాడయిన తనకు నమస్కరించకమునుపై భృగువు ఆసీనుడగుట కోపము వచ్చి యిట్లనెను.
భృగూ! ఏమిటి నీ యీ వింత ప్రవర్తన, నీ ఇచ్చవచ్చినట్టున్నూ, నీకు నచ్చినట్లున్నూ సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా! యీ సభలో మునిగణము కన్న మిన్నయని నీవు నీవు భావించుచుంటివా!
వీరిలో నీవ వెవరకన్న గొప్పవాడవు? త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ యత్రిమహామునికంటే అధికుడవా?
ఇంద్రునే శపించిన యీ గౌతమమహర్షి కంటె గొప్పవాడవా?
చూడు, నివురుగప్పిన నిప్పువలె ఆ యాసనము పై జమదగ్ని ఎట్లు వినయముగా కూర్చొనియున్నాడో?
శక్తిసంపన్నుడైన ఆ జమదగ్ని కన్న నీవు ఊడబొడిచినదేమున్నది?
సభాకార్యములందెట్లు మెలగవలెనో తెలియని తెలివితక్కువ వాడవని నిన్ను నేనిదివరకొనుకొనలేదు’’ అని బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చివాట్లూ పెట్టినాడు.
భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా!
సత్త్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగనే కనిపించునుగదా!
నమస్కారము చేయనంతమాత్రమునకే వుగ్రుడైన బ్రహ్మ. సత్త్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగనే సభను వీడి వెడలిపోయెను.
సభాసదులు మరింతగ ఆశ్చర్యపడిరి.
*నందనందన గోవిందా, నవనీత* *చోర గోవిందా, పశుపాలక శ్రీ గోవిందా,* *పాపవిమోచన గోవిందా;*
*గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట* *రమణా గోవిందా. ||*
||
శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.
*ఓం నమో వెంకటేశాయ*
*సేకరణ:- మన ఆత్మీయ సభ్యులు శ్రీ కె వి రమణమూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి