25, జులై 2023, మంగళవారం

మంచిని ఎందుకు ఆపాలి?

 ఆరు ప్రఖ్యాత అపద్ధాలు

(Six Famous Lies )


కాంగ్రెస్, కమ్యూనిస్టు , సెక్యులరిస్టు పార్టీలు, వాటిని, వాటి నాయకులను సమర్థిస్తూ, పని గట్టుకొని భారతీయ లేదా హిందూ సంస్కృతిని, జాతీయవాదాన్ని, దేవీ దేవతలను కించపరిచే మేధావులను, మీడియా సంస్థలను ఇంగ్లీషులో liberal Eco System అని పిలుస్తారు.


2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి వీరు తెగ బాధ పడిపోతున్నారు. ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని దేశంలోనూ, విదేశాల్లోనూ బద్నామ్ చేయడానికి వీరు చేయని కుట్రలేదు. వీళ్ళ కుట్రలు, ఉద్దేశ్యాలు, వీళ్ళ చివరి లక్ష్యం తెలియని వారు, Facebook , Twitter ,Whatsapp, YouTube లాంటి social media వేదికల్లో ఆధారాలు లేని పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు.


పైన చెప్పుకొన్న ఈ వర్గపు మనుషులు నరేంద్రమోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ఆరు ప్రఖ్యాత అపద్దాలను ఇక్కడ తెలుసుకొందాం.


మొదటి అపద్ధం🙆‍♀️


రఫాల్ వివాదం


ఫ్రాన్స్ తో మోదీ ప్రభుత్వం  చేసకొన్న రఫాల్ యుద్ధ విమానాల ఒప్పందం లో అవినీతి జరిగిందని, ప్రధాని తనకు  అనుకూలంగా వుండే వాళ్ళతో  జత కట్టి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని, పార్లమెంటు లో రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాలు నానా గొడవ  చేసారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది. స్వయంగా  నేనే కమిటీ వేసి నిగ్గుతేలుస్తాను అంది. మాకేమీ అభ్యంతరం  లేదు అన్నది  ప్రభుత్వం.


సుప్రీంకోర్టు చివరకు  ఏమన్నది ?


రఫాల్ ఒప్పందం పారదర్శకంగా వుంది, ఎక్కడా  అవినీతి జరిగినట్టు  సాక్ష్యాలు లేవు. ఒక సారి కాదు, రెండు మార్లు అలా చెప్పింది. చెంప  దెబ్బ తిన్న రాహుల్ గాంధీ  సుప్రీం కోర్టుకు లిఖిత పూర్వకంగా  క్షమాపణ చెప్పాడు.


కాంగ్రెస్ -కమ్యూనిస్ట్  గుంపు సైలెంట్ అయిపోయింది


రెండవ  అపద్దం🙆‍♂️


పెగాసస్ వివాదం


నరేంద్రమోది  ప్రభుత్వం నా ఫోన్ ను, అలాగే ప్రతిపక్షాల ఫోన్లను పెగాసస్  spyware  ద్వారా tap చేస్తోందని  రాహుల్ గాంధీ , ఆయన  పార్టీ, ఇతర ప్రతి పక్షాలు  పార్లమెంట్ ను స్థంబింప చేసాయి , విదేశాల్లో కూడా ఇదే విషప్రచారం చేసారు. వేలాదిమంది  చేత  సోషియల్ మీడియా లో చెప్పించారు.మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది.తమ  

 ఫోన్లలో పెగాసస్ వుంది అని ఎవరు అంటున్నారో వాళ్ళు తమ ఫోన్లను  తమకు  ఇవ్వాలని కోర్టు అడిగింది. కేకలేసిన వేలాది మంది  లో కేవలం 29 మంది  మాత్రమే ఫోన్లు ఇచ్చారు. సుప్రీం కోర్టు  వాటిని దర్యాప్తు చేయిస్తే వాటిలో పెగాసస్  spyware  లేదు అని తేల్చింది.


మరోసారి  సెక్యులర్ గుంపు నిశ్శబ్దం లోకి జారుకొంది.


మూడవ  అపద్ధం🙆‍♀️


చైనా , పాకిస్తాన్ లు మన  భూమిని  ఆక్రమించుకొన్నాయి


నరేంద్రమోది ప్రభుత్వం  తన  చేతకానితనంతో చైనాకు ,  పాకిస్తాన్ కు మన భూభాగాన్ని తాకట్టు పెట్టింది అని మిద్దెలెక్కి అరిచారు.

కానీ స్వయంగా  2012 లో అప్పటి UPA - Congress   ప్రభుత్వం రాజ్యసభలో  పాకిస్తాన్ 78 వేల  చదరపు  కి. మీ భూబాగాన్ని , చైనా  38 వేల  చదరపు  కి. మీ.  భారత భూభాగాన్ని ని తమ  ఆ ధీనం లో వుంచుకొన్నాయని ఒప్పుకొన్నది.  2012 లో ప్రధాని  ఎవరు? ప్రభుత్వం ఎవరిది ?

ఆ భూభాగమంతా  1948 నుండి 1962 వరకూ  కాంగ్రెస్ హయాంలో పోగొట్టుకొన్నదే. అంతే కాదు, పాకిస్తాన్ తనది  కాని POK లో 5180 కి. మీ భూమిని  దుష్ట చైనా కు ఇచ్చుకొంది . ఇదంతా  2014 కు ముందు చరిత్ర. ఇపుడు చైనా   పాకిస్తాన్ లు అలాంటి  సాహసం చేస్తే వాళ్లకు  దిమ్మ తిరిగి పోయే జవాబు  ఇస్తున్నారు మన వీర  సైనికులు.


లౌకిక వీరులు తెర వెనక  దాగారు.


నాల్గవ అపద్దం 🙆‍♂️


బీబీసీ వివాదం


గుజరాత్ అల్లర్ల విషయం లో బీబీసీఅపద్ధాలు , , అర్ధసత్యాలతో వండిన  డాక్యుమెంటరీ ని అడ్డం పెట్టుకొని గొడవ చేశారు.తప్పుడు కథనాలు  అల్లారని ప్రభుత్వం దాన్ని ఆపేస్తే, బీబీసీ ని 24 క్యారెట్ల బంగారం గా చూపించే  ప్రయత్నం చేసారు. విషయం ఎంతవరకు  వెళ్లిందంటే అమెరికా కూడా ఒక దశ లో మన కేంద్ర ప్రభుత్వం పై  కొంచెం అసహనం ప్రదర్శించింది కూడా. మొదటినుండి  అనుమానం తో వున్న ప్రభుత్వం బీబీసీ మీద  నిఘా  పెడితే, అది 40 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిందని  తేలింది. స్వయంగా బీబీసీ నే ఈ తప్పును అంగీకరించింది.


గ్యాంగ్ సెలైంట్ అయ్యింది.


అయిదవ  అపద్దం 🙆‍♀️


ద్రవ్యోల్బణం పై  దుష్ప్రచారం


నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోయిందని , ధరలు విపరీతంగా పెరిగాయని  అంటున్నారు. కొన్ని వస్తువుల ధరలు  పెరిగాయి. కానీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ , చైనా  లాంటి దేశాల్లో పెరిగిన ధరలతో్  పోలిస్తే మన దేశంలో   ధరల పెరుగుదల  5శాతాన్ని మించలేదు. ఆదేశాల్లో 40, 50 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ధరలు  చేరుకొన్నాయి. ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎంతటి  ఆర్థిక ఇబ్బందుల్లో వుందంటే ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేని స్థితిలో వుంది.  అమెరికా లోని ప్రఖ్యాత  నగరం  న్యూయార్క్ నుండి పౌరులు  ఇతర  ప్రాంతాలకు వలస వెళుతున్నారు.

అంతే కాదు, భారత్  ఆర్థికంగా  చాలా  బలంగా  వుందని , రాబోయే రోజుల్లో ప్రపంచ మూడవ  ఆర్థిక శక్తి గా  ఎదగబోతోందని  ప్రపంచ  బ్యాంక్, ఐ ఎం ఎఫ్ లు అంచనా వేస్తున్నాయి. ఇతర  ప్రతిష్టాత్మక సంస్థలు కోవిడ్ సమయంలో, ఆ తరువాత  భారత్ తన ఆర్థిక విధానాలను చక్కగా  రూపొందించుకొని , ఆచి తూచి  అడుగులు వేసిందని  మెచ్చుకొంటున్నాయి.

ద్రవ్యోల్బణం  గురించి కాంగ్రెస్ మౌనంగా  వుంటేనే మంచిది. ఎందుకంటే  ద గ్రేట్  మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గా వున్న సమయం లో ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ లో వుండింది. ఆహార  ద్రవ్యోల్బణం  (food inflation ) 18 శాతానికి  చేరిన  సంగతి  తెలియనిదా ?


సెక్యులర్ దుకాణం వారు ఇది చెప్పరు.


ఆరవ  అపద్ధం 🙆‍♂️


నిరుద్యోగం


నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం  పెరుగుతోందని  ఈ మనుషులు  ఆరోపిస్తారు.

నిజానికి 2017నుండి 2023 వరకూ కేవలం  MSME విభాగంలోనే 6.5 కోట్ల మందికి ఉపాధి  లభించింది.

ముద్ర యోజన ద్వారా  40 కోట్లమంది  రుణాలు  పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే  40 కోట్ల మంది  ముద్ర యోజన లబ్ధిదారుల్లో 27 కోట్ల మంది  మహిళలే. Digital economy  ద్వారా 2014 నుండి 2023 వరకూ  6.15కోట్ల మంది కి ఉపాధి  లభించింది. PM Employment Generation లో భాగంగా  పర్యాటకం  , ఖాదీ, ఆవాస్  మొదలైన  రంగాల్లో  అనేకమందికి ఉపాధి  లభించింది.


సెక్యులర్ వాదులు ముఖం  చాటేసారు.


ఒక  దాని తరువాత  ఈ బూటకపు సెక్యులర్ వాదుల  ఆరోపణలు  కుప్పకూలిపోతున్నాయి.

కానీ ఈ మనుషులు ఇలాంటివి వండుతూనే  వుంటారు. జాతీయవాదులు , దేశభక్తులు  వాటిని తిప్పిగొడుతూనేవుండాలి. 


వాళ్ళు చెడును  ఆపనపుడు మనం  మంచిని  ఎందుకు ఆపాలి?

P Sateesh

కామెంట్‌లు లేవు: