*కం*
ధనముల కన్నను భువిలో
మనసుల నవగతమునొందు మనుషుల నొందన్
ఘనముగ బతుకంగ దగును
మనుగడ సూక్ష్మంబిదియని మరువకు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ధనముల కన్నా మన మనస్సు ను అర్థం చేసుకునే మనుషుల ను సంపాదించగలిగితే గొప్పగా బతకగలమనే మనుగడ సూక్ష్మము ఇదే అని మరువవద్దు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
*కం*
నడిచే దైవము గోవగు
నడిపించెడివాడు భువిని నారాయణుడౌ.
ఎడబాయని హితము శివుడు
కడవరకీ కరణి తలువ ఘనుడగు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! నడిచే దైవము ఆవు,నిన్ను నడిపించేవాడు నారాయణుడు, నిన్ను విడిచిపెట్టకుండా ఉండే శ్రేయోభిలాషి శివుడు అని చివరి వరకూ నమ్మినచో గొప్పవాడవగుదువు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి