9, ఆగస్టు 2023, బుధవారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 6 మరియు 7*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 6 మరియు 7*


నరేంద్రుడు తన ఎనిమిదవ ఏట  (1871 సంII )లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్  మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. ఆనాటి పాఠశాలలలో అది బహుళ ప్రాచుర్యం పొందింది.


చరిత్ర, సంస్కృతం అతడికి నచ్చిన పాఠ్యాంశాలు, గణితమంటే నచ్చదు. 'గణితం కిల్లీ కొట్టువాడికి సముచితమని అతని తండ్రి వ్యాఖ్యానించే వాడు. నరేంద్రుని అభిప్రాయం కూడా ఇదే. ఆంగ్లం నేర్చుకోవడానికి కూడా అతడు ఇష్టపడలేదు. మాతృభాషలో చక్కగా చదువుకోవడం మానుకొని పరాయి భాషను చదువుకోవడమెందుకని అతడు వాదించేవాడు. 

                          తల్లితండ్రులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ నరేంద్రుణ్ణి మొదట    సమ్మతింపజేయలేకపోయారు. 

తరువాత మొత్తానికి ఎలాగో అతడు వారి సలహాను పాటించాడు. ఆంగ్ల అక్షరమాలనూ, ప్రాథమిక పాఠాలనూ స్వయంగా భువనేశ్వరే అతడికి నేర్పింది. కాని అతడికి దాన్లో అంతగా అభిరుచి కలుగలేదు.


కాని ఎవరు చేసిన పుణ్యమో, కాదు, లోకం చేసుకొన్న పుణ్య ఫలంగా అతడు ఆంగ్లభాషను ఆసక్తితో నేర్చుకోసాగాడు. కాలాంతరంలో ఆ భాషకే వన్నె తెచ్చే రీతిలో ఆంగ్లభాషాకోవిదుడయ్యాడు.

నరేన్ బడికి పోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమయిన అజీర్తి వ్యాధి అతణ్ణి దీర్ఘకాలం పీడించింది.  అయినా చలాకీతనంలో, వేడుకలు వినోదాలలో ఎలాంటి మార్పూ లేదు.


నరేంద్రుడు సూక్ష్మబుద్ధి గలవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనిపించేది. క్షణం కూడా ఊరకే ఉండలేడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.  లేదా చెయ్యవలసినదాన్ని గూర్చి యోచిస్తూవుంటాడు. ఏదో 'ఒక శక్తి ఊట తనలో పొంగిపొరలుతున్నట్లు అనిపించడంతో అతడు సదా కార్యోన్ముఖుడయ్యే ఉండేవాడు. 


స్నేహితులతో కలిసి ఒక నాటకం ప్రదర్శించి చూపిస్తాడు. వ్యాయామం చేస్తూవుంటాడు. మిత్రులకు సరదాగా  పేర్లు పెట్టడంలో

సిద్ధహస్తుడు. ఆటల్లోనూ అమిత ఆసక్తి చూపేవాడు .(గోలీలాట. ఎత్తు దూకడం, పరుగు, కబడి, దాగుడు మూతలు, మల్లయుద్ధం మొదలైన ఆటలన్నీ అతడికి కరతలామలకాలు). 


చిన్నతనం నుండే ఆట వస్తువులతో ఆడుకోవడం నరేంద్రునికి చాలాఇష్టం. ఎదిగేకొద్దీ ఈ ఇష్టం విజ్ఞానశాస్త్రపరమైన పరికరాలు తయారుచేసే అభిరుచిగా పరిణమించింది. సహజవాయువుతో పనిచేసే పరికరాలు, బొమ్మ రైలు, నాడు కలకత్తాలో బహుళ ప్రాచుర్యం పొందిన సోడా మొదలైనవి తయారుచేయడంలో నరేంద్రుడు నిమగ్నమయ్యేవాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: