9, ఆగస్టు 2023, బుధవారం

నవవిధభక్తిమార్గాల

 అవన్నీ నవవిధభక్తిమార్గాలలోని భేదాలండి.


*శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం*

*అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం*


1. శ్రవణం: భగవంతుని కథలను శ్రద్ధాభక్తులతో వినటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: పరీక్షిత్తు మహారాజు 


2. కీర్తనం: కీర్తనలను భక్తిశ్రద్ధలతో పాడుకొంటూ భగవంతుని సేవించుకోవటం 

ఉదా: మీరాబాయి, అన్నమయ్య మొ॥


3. విష్ణోఃస్మరణం: ఎల్లప్పుడూ భగవంతుని స్మరించుకొంటూ భగవంతుని సేవించుకోవటం 

ఉదా: ప్రహ్లాదుడు 


4. పాదసేవనం: భక్తిశ్రద్ధలతో భగవంతునికి పాదసేవ చేసుకొనటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: 


5. అర్చనం: శ్రద్ధాభక్తులతో భగవంతుని పూజించుకోవటం 

ఉదా: మనందరం చేసేది ఇదే 


6 వందనం: నమస్కరించటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా:


7. దాస్యం: దాసుడిగా భగవంతునికి సేవచేసుకోవటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా:


9. సఖ్యం: భగవంతునితో స్నేహము చేయటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: కుచేలుడు 


10. ఆత్మనివేదనం: భగవంతునికి తనను తాను సమర్పించుకోవటం. 

ఉదా: గోపికలు 


ఇవి తొమ్మిది విధాలైన భక్తిమార్గాలు 


వీటిలో అన్ని విధాల భక్తి విశేషాలకు ఉదాహరణలు నాకు జ్ఞప్తి లేవు. మీకెవరికైనా తెలిస్తే చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు: