మనం కలియుగంలో ఉంటూ త్రేతాయుగంలోని వాల్మీకితో పోల్చూకోకూడదండి. కృత త్రేత ద్వాపర కలియుగాలకు లక్షణాలు ధర్మాలు వేరు వేరు.
ప్రవృత్తి నివృత్తి మార్గాలు ఉపయోగం లేనివే అయితే.... ఆదిశంకరులవారు ఈ మార్గాలన్నీ ఎందుకు బోధించినట్లు? ఉపనిషత్తులకు, భగవద్గీతకూ భాష్యాలను ఎందుకు రచించినట్లు? వ్యాసులవారి బ్రహ్మసూత్రాలకు భాష్యమును ఎందుకు రచించినట్లు?
ఈమధ్య సర్వమత సమానత్వం అంటూ ఒక పనికిరాని వాదం ఒకటి బయలుదేరదీశారు. ఆచారాన్ని పాటించటం సంధ్యావందనాది నిత్యనైమిత్తికాలను భారంగా భావించే వారికోసం అంటూ సొంటూ అంతా మిథ్య. నా దగ్గరకు వస్తే ఆ నిత్యనైమిత్తికాలతో పనిలేదు. ఆచారంతో పని లేదు. పూజలక్కరలేదు. తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టనక్కరలేదు. అంటూ బోధించే వారు జనాలను తెగ ఆకర్షించేస్తున్నారు. ఆ మోజులో పడి మన స్వసంస్కారాలకు సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి సర్వమతసమానత్వం అంటూ జనాలు ఊరేగుతున్నారు.
ఆవిధంగా సులభపద్ధతికి అలవాటు పడిన వారికి ఇదంతా పనికిమాలిన మార్గమే....
*సంప్రదాయానికి దూరమౌతున్నవారిని చూచి ఉబికి వస్తున్న నా యొక్క ఈ ఆవేదన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి