బోయవానికి ప్రవృత్తా, న్నివృత్తా ఏముందని అతను అంతటివాడయ్యాడు అని మీరు సెలవు ఇచ్చారు. వాల్మీకి గాధ వింటే మీరు ఈ విధంగా అనరు.
బ్రహ్మ మానస పుత్రుడైన ప్రచేతసుని కుమారుడు వాల్మీకి. తండ్రి శాపం వలన అతను కిరాతకుడిగా మారవలసి వచ్చింది. సప్త ఋషులు ఆశీర్వాదంతో ఆయన తపస్సు చేసి సమాధి స్థితికి చేరుకోగలిగాడు.
తపస్సు కాలంలో ఆయన చుట్టూ పుట్టలు చేరాయి. ఆ కిరాతకును వల్మీకo నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు.
వాల్మీకి ప్రవృత్తి నివృత్తులు ఆపాదించలేం.
ఇంక ప్రహ్లాదంటారా శ్రీశర్మద గారు నుడివినట్లు నీ వృత్తి మార్గంలో స్మరణo.
ఏ బాటైనా ఆ భగవంతుని చేరుకోవడానికే. కానీ శౌచం ధర్మంలోని నాలుగు పాదాల్లో ఒక పాదం.
భగవంతుడు సృష్టి చేసినప్పుడు మనతోపాటుగా యజ్ఞములను సృష్టించాడు. మానవులు యజ్ఞం చేసి హవిస్సులు దేవతలకు సమర్పించాలి. ఇవి వోండురుల శ్రేయస్సుకు మంచిది.
శుభం భూయాత్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి