*_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*సర్వద్రవ్యేషు విద్యైవ*
*ద్రవ్యమాహురనుత్తమమ్।*
*అహార్యత్వాదనర్ఘత్వాత్*
*దక్షయత్వాచ్చ సర్వదా॥*
....*హితోపదేశః*
𝕝𝕝తా𝕝𝕝
అన్ని కాలములయందు విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెలకట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ... పంచిననూ... తరగనిదైనందువలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు.
సర్వద్రవ్యమందు నుర్విలోశ్రేష్ఠమ్ము
విద్యయొకటె యెపుడు వెదకిచూడ
దొంగలించబడదు దుర్మార్గులవలన
తరగ దెపుడు యెంత దాన మిడిన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి