9, జనవరి 2025, గురువారం

నిజమైన భక్తుని

 🌹🙏 అరుణాచల శివ🙏🌹☝️



*నిజమైన భక్తుని - లక్షణం ఎలా వుంటుంది?*

```

నిజ భక్తులకు తన ఊహలు ఎప్పుడూ భగవంతుని పైనే ఉండును.

తన సౌఖ్యము, తన కష్టముల విషయమై తెలుసుకొనుటకు భక్తులకు సావకాశము ఉండదు.

వారికి భగవత్సాక్షాత్కారము తప్ప ఇంకొక విషయము స్ఫురించదు, అందుకు అవకాశము కూడా ఉండదు.


ఉదాహరణకు...

ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కనపడక “అమ్మా,అమ్మా” అని ఏడుస్తూ అమ్మ కోసం వెతుకుతాడు.

అమ్మ కనిపించి వానిని యెత్తు కొన్నప్పుడు ఆ పిల్లవాడు ఏడ్పు మాని విచారము లేకుండా ఉంటాడు,

కానీ పిల్లవాడి పూర్వము ఉన్న స్థితిని, అమ్మ ఒడిలో ఉన్న స్థితిని, తేడా గమనించవలసిన అవసరమే లేదు. ఆఊహే తనకింక అవసరముండదు.


అట్లే భగవంతుని సేవ, భగవంతుని చింతన, అనే మహాద్భాగ్యం దొరికిన తరువాత, వేరు చింతలు కష్టములు తాను తలంచడు.


ఇవన్నియూ దొరకనంత వరకే! దొరికిన తరువాత, అనుభవించుటకు చూచునే కానీ, పూర్వపు ఊహలను యోచించడు.


వారు ఎప్పుడూ, ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, భగ్వద్ విషయాలే వుంటాయి, భగ్వద్ కథలే మాట్లాడుతారు, చేసే పనులు భగ్వద్ సంభదితమై వుంటాయి.

అలాంటి వారిని నిందించడం కానీ, హేళన చేయడం కానీ మహా పాపం, దానికి ప్రక్షాళన అనేది కూడా లేదు.



🌹🙏🌴🪔🌴🙏🌹



ఆత్మీయులకు శుభాశీస్సులు - *ధీర్ఘాయుష్మాన్ భవ!



           *03, జనవరి, 2025*

            *దృగ్గణిత పంచాంగం*

        


*సూర్యోదయాస్తమయాలు:*

ఉ 06.37 / సా 05.47

సూర్యరాశి : ధనుస్సు 

చంద్రరాశి : మకరం/కుంభం


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం*

*హేమంత ఋతౌః / పుష్యమాసం / శుక్లపక్షం*


*తిథి      : చవితి* రా 11.39 వరకు ఉపరి పంచమి

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 10.22 వరకు ఉపరి శతభిషం


*యోగం  : వజ్ర* మ 12.38 వరకు ఉపరి సిద్ధి

*కరణం  : వణజి* మ 12.25 భద్ర రా 11.39 ఉపరి బవ


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : మ 12.19 - 01.51

అభిజిత్ కాలం  :  ప 11.50 - 12.34


*వర్జ్యం             : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.51 - 09.36 మ 12.34 - 01.19*

*రాహు కాలం   : ఉ 10.48 - 12.12*

గుళికకాళం       : ఉ 08.01 - 09.24

యమగండం    : మ 03.00 - 04.24

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  ఉ 06.37 - 08.51

సంగవ కాలం      :    08.51 - 11.05

మధ్యాహ్న కాలం    :   11.05 - 01.19

అపరాహ్న కాలం: మ 01.19 - 03.33

*ఆబ్ధికం తిధి    : పుష్య శుద్ధ చవితి*

సాయంకాలం   :  సా 03.33 - 05.47

ప్రదోష కాలం     :  సా 05.47 - 08.21

రాత్రి కాలం        :  రా 08.21 - 11.47

నిశీధి కాలం        :  రా 11.47 - 12.38

బ్రాహ్మీ ముహూర్తం :   తె 04.54 - 05.46


🌹🙏🌴🪔🌴🙏🌹

        *03-01-2025-శుక్రవారం*

    *రాశి ఫలితాలు:*

           

```

మేషం

నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.


వృషభం

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.


మిధునం

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి.  చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల  సహాయం  లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న  సమస్యలకు   పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.


కర్కాటకం

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.


సింహం

ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారి నుండి  ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.


కన్య

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు  తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం  బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


తుల

వృత్తి ఉద్యోగ  విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.


వృశ్చికం

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు.


ధనస్సు

వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.


మకరం

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది.  రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.


కుంభం

సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.


మీనం

ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి


🌹🙏🌴🪔🌴🙏🌹

కామెంట్‌లు లేవు: