🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*శ్రీ విష్ణు స్త్రోత్రం*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*గరుడ గమన తవ చరణకమలమిహ*
*మనసిల సతు మమ నిత్యం*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ ।*
*తాత్పర్యం:~*
*గరుత్మంతుని అధిరోహించి, లోకములన్నీ సంచరించే ఓ శ్రీహరీ ! నీ పాదపద్మాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలసి ప్రకాశించే వరాన్ని ప్రసాదించు ! ప్రపంచ విషయాలయందు నాకున్న తాపత్రయాన్ని, ఈ జన్మలో కౌమార, యౌవన, వార్థక్యాలలో తెలిసి గానీ, తెలియక గానీ నేను చేసిన పాపాల్ని హరింపజేయుము దేవ.*
(1)
*జలజనయన విధి నముచి హరణముఖ*
*విబుధ వినుత పదపద్మ*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ।*
*తాత్పర్యం:~*
*బ్రహ్మ, నముచి అనే రాక్షసుడిని సంహరించిన ఇంద్రుడు మొదలైన దేవతలచే కొలువబడే పద్మములవంటి కన్నులు కలగిన ఓ శ్రీహరీ ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ౹*
(2)
*భుజగశయన భవ మదనజనక మమ*
*జనన మరణ భయహారీ*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ।*
*తాత్పర్యం:~*
*శేషతల్పంపై శయనించే సర్వాంతర్యామి, మన్మథుని జనకుడవైన ఓ శ్రీహరీ ! నాకున్న జనన, మరణ భయాలను హరింపజేయుము దేవ।*
(3)
*శంఖచక్రధర దుష్టదైత్యహర*
*సర్వలోక శరణ*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ।*
*తాత్పర్యం:~*
*శంఖ చక్రాలను ధరించి, దుష్టులైన రాక్షసులను సంహరించి అన్ని లోకములకు ఆశ్రయమైన ఓ శ్రీహరీ ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ ।*
(4)
*అగణిత గుణగణ అశరణ శరణద*
*విదళిత సురరిపు జాల*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ।*
*తాత్పర్యం:~*
*లెక్కింపజాలని సుగుణాల సముదాయము కలిగి, దేవతలకు శత్రువులైన రాక్షసులను చీల్చి చెండాడి సంహరించి, దిక్కుతోచని దీనులకు ఆశ్రయమై నిలచే ఓ శ్రీహరీ! నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ।*
(5)
*భక్తవర్యమిహ భూరికరుణయా*
*పాహి భారతీ తీర్థం ।*
*మమతాపమపా కురు దేవ*
*మమపాపమపా కురు దేవ।*
*తాత్పర్యం:~*
*భక్తవర్యుడనైన భారతీ తీర్థ నామధేయుడనైన నన్ను మిక్కిలి దయతో రక్షించి, నా పాపాలు, తాపములు పోగొట్టుము దేవ ।*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*గరుడ గమన స్తోత్రాన్ని పఠిస్తే అంతే శుభమే జరుగుతుంది. ఈ స్తోత్రాన్ని శృంగేరి మఠ పీఠాధిపతులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామిజి రచించారు. స్వామి భారతి తీర్థ స్వాముల వారు గొప్ప పండితులు మరియు విద్వాంసులు. ఆయన శ్రీ మహావిష్ణువును కీర్తించడానికి ఈ స్తోత్రాన్ని రచించడం జరిగింది.*
*ఈ "గరుడ గమన తవ" శ్లోకాన్ని వింటుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది.మనసులో మరియు మెదడు లో ఉన్న చెడు ఆలోచనలు, ఉద్రికతలు, బాధలు అన్ని మరచిపోతాం.ఈ స్తోత్రానికి ఉన్న మహిమ మరియు మహత్యం అలాంటిది. ఎలాంటి మనిషి ఐన మాములు స్థితికి తెచ్చే శక్తి ఈ స్తోత్రానికి ఉంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. బాధలతో సతమతం అవుతున్న వారు, మనశ్శాంతి లేకుండా ఉన్న వారు, నిర్మలమైన మనసుతో ఈ స్తోత్రాన్ని పఠిస్తే వారి మనసులో ఉన్న బాధలు అన్ని తొలగిపోయి మనః శాంతి లభిస్తుంది.*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి