16, డిసెంబర్ 2020, బుధవారం

ధనుర్మాస

 మిత్రులందరికీ "ధనుర్మాస ప్రారంభోత్సవశుభాకాంక్షలు"

సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి "ధనుర్మాసం"ప్రారంభ మవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసంమొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగు స్తుంది.

కార్తీక మాసం,మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు.  కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాస మంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల "మహాలక్షి" కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.

'ధనుర్మాసం' వైష్ణవులకు చాలా ప్రత్యేకమైనది.

 తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. 'సుప్రభాతం' బదులు "తిరుప్పావై" గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని 'బాలభోగం' అంటారు.  ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతు లలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది.సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించ డం చాలా మంచిది.

ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి.

ధనుర్మాసంలో విష్ణువును 'మధుసూధనుడు' అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్ధోజనం అర్పించాలి.

పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్ల తో  పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి "మార్గళి వ్రతం" పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పర లోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.

మన మిత్రులందరికీ ఆ " విష్ణుమూర్తి "కటాక్ష ప్రాప్తిరస్తు  ........

కామెంట్‌లు లేవు: