16, డిసెంబర్ 2020, బుధవారం

ద్రాక్షారామం

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

ద్రాక్షారామం :-స్వామి :-భీమేశ్వరుడు,

అమ్మ వారు :-మాణిక్యాంబదేవి

రూపం:-తత్పురుషరూపము(ఆత్మ స్వరూపము)

ప్రతిష్ట :-స్వయం భువు

తారకాసురుని మెడలోని అమ్రుత లింగము యొక్క ద్వితీయ ఖండము పడిన ప్రదేశమే ద్రాక్షారామం. ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందినది. ఈ క్చేత్రములో పరమేశ్వరుడు తత్పురుషముఖ రూపుడై స్వయంగా ప్రతిష్టుతుడు అయినాడు ఈ క్చేత్రములో పడిన అమ్రుతలింగ ఖండము ను ప్రతిష్ట చేయడానికి సూర్యుడు నియమింపబడినాడు. ఈ ప్రతిష్ట చేయడానికి పవిత్ర గోదావరి జలాలు తో అభిషేకించడానికి సప్తఋషులను దేవతలు పంపించారు. ఆ ఋషులు గోదావరి మాతను ప్రార్ధించి ఆ నదీమతల్లితో వస్తూంటే దారి లో ఉన్న తుల్యమర్షి ఆశ్రమము మునిగిపోయింది. ఆ ముని కోపం తో శపించారు. అప్పుడు గోదావరి మధ్యవర్తిగా ఉండి దైవకార్యము యొక్క ప్రయోజనం తెలిపి మునులను ఋషులనూ శాంతపరచి అంతర్వాహిని గా ద్రాక్షారామం చేరుకుంది. అదే సప్తగోదావరి. ఆ కార్యక్రమం ఆలస్యం అయినందున శివుడు తనంత తానుగా ప్రతిష్ఠితుడైనాడు. సూర్యుడు ప్రధమ అర్చన చేశాడు. సూర్యుడు భూమిపై ఏవిధంగా ప్రకాశించునో, అదేవిధంగా ద్రాక్షారామం స్వయం ప్రకాశమై రెండవ కైలాసం గా వెలుగొందగలదని వరమిచ్చినాడు. అప్పుడు అక్కడ గర్భగృహము అంతా కూడా భరించలేని వేడి పుట్టింది. అది భరించలేక దేవతలు, ఋషులు పరమేశ్వరుని వేడుకున్నారు. అప్పుడు అశరీరవాణి ఈవిధంగా పలికింది. "పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టుతుడై సూర్యుని  ప్రపధముగా అర్చించుటవలన ఈ వేడి పుట్టింది. ఈ క్చేత్రమునకు అష్ట దిక్కులలోనూ సోమేశ్వర లింగములు ప్రతిష్ట చేస్తే ఈ వేడి తగ్గుతుంది అని చెప్పింది

           రవాణి తెల్పిన ప్రకారం సప్త ఋషుల అష్టదిక్కుల లోనూ

సోమేశ్వర లింగములు ను ప్రతిష్ఠించి తమతో తీసుకువచ్చిన సప్తగోదావరి తీర్థజలములతో అభిషేకించారు. తూర్పున సూర్యుడు, ఆగ్నేయమున కశ్యప మహర్షి, దక్షిణ దిశలో అత్రిమహర్షి నైరుతి లో భరద్వాజ మహర్షి, పడమర విశ్వామిత్రుడు, వాయువ్యములో గౌతమ మహర్షి ఉత్తరము న వశిష్ఠ మహర్షి ఈశాన్య భాగము న జమదగ్ని మహర్షి ప్రతిష్టించారు.

      ఇక్కడ అమ్మ వారు మాణాక్యాంబాదేవి, అష్ఠాదశశక్తి పీఠాలలో పన్నెండవ పీఠముగా ప్రఖ్యాతి గాంచినది. ఆదిశంకారాచార్యులవారిచే ప్రతిష్ఠంపబడిన శ్రీ చక్ర రాజిస్తితమైన మాణిక్యాంబ అమ్మ వారి దివ్య పాదారవిందములను శ్రీ చక్ర మేరువును ఏకకాలంలో దర్శించుకోవచ్చును. భక్తుల పాలిట కల్పతరువు అయిన ఈ అమ్మవారి కి వేలాదిమంది భక్తులు నిత్యమూ కుంకుమార్చనలు జరిపించుకుని అమ్మవారి క్రుప కటాక్షము లకు పాత్రులగుచున్నారు. ఈ దివ్య క్చేత్రములో సూర్యుని ప్రధమార్చన అగుటచేత ప్రతీరోజూ ఉదయమూ సాయంత్రం యందు సూర్య భగవానుని కిరణాలు స్వామి పాదములు చెంత పడతాయి. సశేషం

కామెంట్‌లు లేవు: